సెంట్రల్ జైళ్లలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలి | Patrol Stations in Central prisons | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైళ్లలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలి

Published Fri, Jun 12 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

Patrol Stations in Central prisons

 ఐఓసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం రాజప్ప
 అమలాపురం టౌన్ : రాష్ట్రంలోని సెంట్రల్ జైళ్లలో పెట్రోల్ బంక్‌ల ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రతినిధులను ఆదేశించారు. ఐఓసీ విశాఖ డివిజన్ రిటైల్ సేల్స్ చీఫ్ మేనేజర్ కె.జానప్రసాద్, కాకినాడ రిటైల్ సేల్స్ ఏరియా మేనేజర్ కేవీపీ కిరణ్‌కుమార్‌లు రాజప్పను అమలాపురంలోని ఆయన నివాసంలో గురువారం కలుసుకున్నారు. కేంద్ర కారాగారాల అభివృద్ధిలో భాగంగా జైళ్లవద్ద ఐఓసీ ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైలువద్ద అదనపు ఔట్‌లెట్ల ఏర్పాటు ఎంతవరకూ వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. త్వరలో రెండు ఔట్‌లెట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టు చీఫ్ మేనేజర్ ప్రసాద్ వివరించారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న నూతన రాజధాని ప్రాంతంలో ఐఓసీ కార్యకలాపాల విస్తరణ, రిటైల్ ఔట్‌లెట్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement