రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా పట్టిసీమ ప్రాజెక్టు పత్రికా ప్రకటనలో మరో వింత చోటుచేసుకుంది. 1500 క్యూసెక్కుల నీటిని నిల్వచేసే రిజర్వాయర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వెల్లడించారు. ప్రాజెక్ట్ డిజైన్ లో ఎక్కడా లేని రిజర్వాయర్ ప్రస్తావన ప్రాజెక్ట్ పత్రికా ప్రకటనలో వెల్లడించడంతో నిపుణులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నీటి నిల్వను క్యూసెక్కులలో కొలవరనే విషయం అధికారులకు తెలియకపోవడం మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. పట్టిసీమపై సర్కార్ కు స్పష్టత లేదనడానికి ఇదో ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.