![నేడు నెల్లూరుకు 'పవన్' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51413537467_625x300.jpg.webp?itok=3gyHbD2o)
నేడు నెల్లూరుకు 'పవన్'
నెల్లూరు: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం వెళ్లనున్నారు. అక్కడ జరిగే సంక్రాంతి సంబురాలకు ఆయన హాజరు కానున్నారు. పవన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎంతో కలిసి పవన్ సంబురాలకు హాజరు కావడం పై పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.