
ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం విశ్రాంతి తీసుకున్నారు. జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే వ్యక్తిగత భద్రతా సిబ్బంది, బౌన్సర్ల కొరత కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి టెక్కలి సభలో మాట్లాడిన పవన్.. ఆ తర్వాత శ్రీకాకుళంకు సమీపంలో ఉన్న ఎచ్చెర్ల మండలం ఎస్.ఎంపురంలోని డాట్లా హోంలో ఉన్న రిసార్ట్‌కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు.
గురువారం ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. విశ్రాంతి తీసుకుంటున్న గదిలో నుంచి కూడా పవన్ బయటకు రాలేదని తెలిసింది. శుక్రవారం కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు ఖరారు కాలేదు. అయితే జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కుశాలపురం సమీపంలోని వైశ్యరాజు కన్వెన్షన్ హాల్‌లో ఉదయం అభిమానులతో సమావేశం, సాయంత్రం నరసన్నపేటలో బస్సు యాత్రలో పవన్ పాల్గొనే అవకాశం ఉందని అభిమానులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమ్ వర్మ ఆదేశాల మేరకు జేఆర్ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్సై వై.కృష్ణ శాంతిలు పవన్‌కల్యాణ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment