
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం విశాఖపట్నం రానున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ఆదివారం వెల్లడించాయి.
సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 9.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ కోట చేరుకుని మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం ఎస్ కోట పైడిమాంబ ఫంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.