Porata Yatra
-
నీకు కన్పించకపోతే.. నీ కొడుకును పంపు..
సాక్షి, విశాఖపట్నం: మహారాష్ట్ర తరహాలో ఏపీలోనూ రైతులు తమ హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటాన్ని రాజధాని ప్రాంతమైన ఉండవల్లి నుంచే మొదలు పెడతామన్నారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు. శుక్రవారం ఉదయం అమరావతి, కాకినాడ సెజ్, పోలవరం, సోంపేట, వంశధార ప్రాజెక్టులు, భావనపాడు పోర్టు, కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూ నిర్వాసితులతో కలిసి విశాఖలో ఏపీ భూ నిర్వాసితుల జనసభ నిర్వహించారు. ఈ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పురాణాల్లో హిరణ్యకశ్యపుడి మాదిరిగానే నేటి పాలకులు భూములు లాక్కొని రైతును, రైతు కుటుంబాలను రోడ్డు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజధాని కన్పించదు. పరిశ్రమలు రావు. ఉద్యోగాలు ఇవ్వరు. కానీ వాటి పేరు చెప్పి వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంటూ.. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని’ ఆరోపించారు. విశాఖలో ఇన్నో సొల్యూషన్స్, ప్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు ఎకరా రూ.35 లక్షలకే కట్టబెట్టారని, బయట వాళ్లకైతే ఎకరా రూ.3.5 కోట్లు అంటున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసే వరకు, భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలన్నారు. నీకు కన్పించకపోతే..నీ కొడుకును పంపు.. ఉత్తరాంధ్రలో సమస్యలు మీ కంటికి కన్పించకపోతే మీ కొడుకు లోకేష్‌ను పంపితే ఆయనకు చూపిస్తానని పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు సూచించారు. జూట్ మిల్లును సందర్శించిన అనంతరం తగరపువలస జంక్షన్లో జరిగిన బహిరంగçసభలో 2019 ఎన్నికల్లో టీడీపీ గూండాలు పేట్రేగిపోయి దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటారని ఆరోపించారు. ‘మంత్రి గంటా, ఎంపీ అవంతి గెలుపొందడానికి నేనే కారణం.. కానీ వాళ్లు ఈ ప్రాంతానికి ఏం చేశారని’ ఆయన ప్రశ్నించారు. ‘వైఎస్సార్సీపీ నుంచి లాక్కున్న ఎంపీలతో కలిసి మీకు 19 మంది ఉన్నా కనీసం రైల్వే జోన్ కూడా ఎందుకు సాధించలేకపోతున్నారని’ నిలదీశారు. నేడు నిరసన కవాతు.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి నిరసనగా విశాఖలో శనివారం నిరసన కవాతు జరపనున్నట్టు జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్‌రోడ్‌లోని ప్రారంభం కానున్న నిరసన కవాతుకు పవన్ సారథ్యం వహిస్తారని చెప్పారు. -
అసమానతలపై ప్రశ్నిస్తే విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?
సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట: ప్రాంతీయ అసమానతలపై ప్రశ్నిస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నానంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవీ జంక్షన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘పట్టిసీమకు రూ.2వేల కోట్లు ఇవ్వగలిగినపుడు ఈ నియోజకవర్గంలో 8 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాబూ జగ్జీవన్‌రామ్ ఎత్తిపోతల పథకానికి డబ్బులు లేవంటే ప్రాంతీయ అసమానతలు రావా? మీరు అసమానతలు సృష్టించి మమ్మల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నామనడం ఏమిటి?’ అని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా నిరుద్యోగమే కనిపిస్తోందన్నారు. బాబు వస్తే జాబు అన్నారనీ, కానీ ముఖ్యమంత్రి గారి బాబుకే జాబు వచ్చింది తప్ప ఎవ్వరికీ రాలేదని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం వచ్చి పోరాటం ప్రారంభిస్తే నిరుద్యోగ భృతి ప్రకటించారని, కానీ వారికి కావాల్సింది ఉద్యోగమని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ చేసి, దేశం నేతల నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకూ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముకుని వసూళ్లు చేసుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఎంపీలంతా కనీసం ఒక్క కొత్తవలస రైల్వేబ్రిడ్జి సాధించలేకపోయారని విమర్శించారు. ఓ ఎంపీ ఏకంగా జోన్ లేదూ గీనూ లేదూ అంటారు.. ఇదేం తీరని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన 23 కులాల వారు హైదరాబాద్‌లో స్థిరపడినా, తెలంగాణలో బీసీ జాబితాలో వారు లేరని, దీనిపై మన రాష్ట్ర సీఎం ఎలాగూ పట్టించుకోరు కాబట్టి తానే తెలంగాణ సీఎంతో మాట్లాడతానన్నారు. నేడు తుమ్మపాల సుగర్స్‌కు పవన్ శృంగవరపుకోట పర్యటన అనంతరం విశాఖ–విజయనగరం జిల్లా సరిహద్దులోని తాటిపూడి జలాశయాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ముచ్చటించారు. అక్కడ నుంచి రాత్రి విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖ నగరంలోని టీపీటీ కాలనీలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 10.30 గంటలకు అనకాపల్లిలోని తుమ్మపాల సుగర్స్‌కు వెళ్తారు. అక్కడ కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం 12 గంటలకు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు తాడి గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ ఫార్మా కంపెనీ ప్రభావిత గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని చోడవరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి విశాఖ చేరుకుంటారు. -
నేడు ఎస్ కోటలో పవన్ సభ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం విశాఖపట్నం రానున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ఆదివారం వెల్లడించాయి. సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 9.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ కోట చేరుకుని మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం ఎస్ కోట పైడిమాంబ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. -
విశాఖ జిల్లాలో పవన్ పోరాటయాత్ర
-
ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు గాలికొదిలేశారు
-
హోదాను అడ్డుకుంది ముమ్మాటికీ చంద్రబాబే
-
ప్రధాన మంత్రిపై ఏపీ ప్రజలు విశ్వాసం కోల్పోయారు
-
ఇచ్చాపురం నుంచి పవన్ పోరాట యాత్ర ప్రారంభం