![ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51456349587_625x300.jpg.webp?itok=uG-O5qRB)
ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి
వేంపల్లె: ఎన్టీఆర్, చంద్రబాబుకు పోలికే లేదని, వారి మధ్య సతీ సావిత్రికి, చింతామణికి ఉన్నంత తేడా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లెలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఇతర పార్టీల వారు టీడీపీలో చేరదలుచుకుంటే ఆ పార్టీల పరంగా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేసిన తర్వాతనే టీడీపీలోకి రావాలని ఆనాడు ఎన్‌టీఆర్ తీర్మానం చేశారన్నారు. నేడు ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.