comparison
-
జుపీటర్ 125 Vs యాక్టివా 125: ఏది బెస్ట్?
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ''టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125''. ఈ రెండూ 125సీసీ విభాగంలోనే స్కూటర్లు. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో ఏ స్కూటర్ కొనుగోలు చేయాలి?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధరలు, మైలేజ్ వంటి విషయాలు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాంటి వారికోసం ఈ కథనం ఓ చక్కని పరిష్కారం..టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్స్ రెండూ డిజైన్, ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ధర, మైలేజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ బేరీజు వేసుకుని.. అవసరాలకు దృష్ట్యా నచ్చిన స్కూటర్ ఎంచుకోవడం అనేది పూర్తిగా కొనుగోలు చేసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. -
మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?
Mahindra Thar vs Maruti Jimny: భారతీయ మార్కెట్లో చెప్పుకోదగ్గ అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ ఏది అనగానే టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీకి చెందిన థార్. అయితే థార్ ఎస్‌యువికి అసలు సిసలైన ప్రత్యర్థిగా 'మారుతి జిమ్నీ' ఇటీవలే దేశీయ విఫణిలో అడుగెట్టింది. ఈ రెండు ఆఫ్ రోడర్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ మారుతి సుజుకి జిమ్నీ బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే బాడీ ప్రత్యేక ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్కేల్డ్-డౌన్ జి-వ్యాగన్ మాదిరిగానే బాక్సీ డిజైన్‌తో నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా భారతీయ భూభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్ పొందుతుంది. ఇది ఆఫ్-రోడింగ్ చేయడానికి అనుకూలమైన వాహనం. ఇది సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్ అనే రెండు ఆప్షన్స్ పొందుతుంది. ఫీచర్స్ ఫీచర్స్ పరంగా రెండూ కూడా ఉత్తమంగా ఉంటాయి. మంచి పట్టుని అందించడానికి అనుకూలంగా ఉండే స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే, అద్భుతమైన సీజింగ్ పొజిషన్, క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. వీటితో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో మహీంద్రా థార్ 4 స్టార్ స్కోరింగ్ సొంతం చేసుకుని భారతదేశంలో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కాగా జిమ్నీ కూడా మంది సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది, అయితే సేఫ్టీ రేటింగ్ ఇంకా తెలియాల్సి ఉంది. కలర్ ఆప్షన్ మహీంద్రా థార్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి న్యాపోలీ బ్లాక్, రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, ఆక్వా మెరైన్, ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ కలర్స్. ఇక జిమ్నీ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది మిడ్ నైట్ బ్లాక్ రూప్‌తో రెడ్ కలర్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో రెడ్, బ్లూయిష్ బ్లాక్ రూప్‌తో కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, నెక్సా బ్లూ కలర్స్ పొందుతుంది. డైమెన్షన్ మారుతి జిమ్నీ కొలతల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 3850 మిమీ, వెడల్పు 1645 మిమీ, ఎత్తు 1730 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ, వీల్ బేస్ 2550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా థార్ పొడవు 3985 మిమీ, వెడల్పు 1820 మిమీ, ఎత్తు 1970 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 219 మిమీ, వీల్ బేస్ 2450 మిమీ వరకు ఉంటుంది. మహీంద్రా థార్ 3 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణం పరంగా జిమ్నీ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్యువి 1.5-లీటర్ K-సిరీస్ ఇంజన్ కలిగి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సహాయంతో 102 bhp పవర్ 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) మహీంద్రా థార్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 150 bhp పవర్ 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఇందులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130 bhp పవర్ 300 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ కూడా లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) ప్రాక్టికాలిటీ మారుతి జిమ్నీ 5 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణంలో మహీంద్రా థార్ కొంత పెద్దదిగా ఉంటుంది. రెండూ కూడా అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో మహీంద్రా థార్ సంచలన అమ్మకాలను పొందింది. జిమ్నీ కూడా విడుదలకు ముందే దాదాపు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కావున జిమ్నీ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మొదలైన విషయాల్లో దేనికదే సాటిగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇవన్నీ బేరీజు వేసుకుని నచ్చిన మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు. -
గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మహానేతలతో పోల్చవద్దని పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు ఆధారపడవద్దని, ప్రస్తత తరం పరిస్థితులు పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పార్టీ నాయకుడు ఒకరు రాహుల్‌ను మహాత్మా గాంధీతో పోల్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'ఇలా పోల్చడం తప్పు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి నాయకులతో పోల్చడం సరికాదు. మహాత్మ గాంధీ గొప్ప వ్యక్తి. దేశ స్వేచ్ఛ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. 10-12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నన్ను ఆయనతో పోల్చవద్దు.' అని రాహుల్ అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీల గురించి కూడా ప్రస్తావించి భారమైన హృదయంతో సందేశం ఇచ్చారు. 'రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ఎంతో చేసి అమరులయ్యారు. తమ వంతు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రతి సమావేశంలో వాళ్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ.. వాళ్లు చేయగలిగినంత చేశారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ల వంతు భూమిక పోషించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనే దానిపైనే దృష్టి సారించాలి. ప్రజల కోసం ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి' అని రాహుల్ పేర్కొన్నారు. मैं अपने कांग्रेस पार्टी के मित्रों से थोड़ी कड़ी बात कहना चाहता हूं। इंदिरा गांधी जी और राजीव गांधी जी ने अच्छा काम किया... लेकिन कांग्रेस को हर मीटिंग में यह दोहराना नहीं चाहिए। हमें अब ये बोलना चाहिए कि हम जनता के लिए क्या करेंगे। यह ज्यादा जरूरी है। - @RahulGandhi जी pic.twitter.com/0VyYfb478S — Congress (@INCIndia) December 14, 2022 రాహుల్ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా బుధవారం రాజస్థాన్‌లో రాహుల్‌తో పాటు కలిసి పాదయాత్ర చేశారు. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ యాత్రతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. చదవండి: వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి -
జీవన సంగీతం
ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమిలేముల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యునీక్, స్పెషల్. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకే రకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు. నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్ చేసుకుంటున్నాం. కెరియర్ వరకూ ఏమో గానీ, కరెంట్ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధాన మయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు. మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కyì నుంచి వస్తుంది? కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు – ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం. ‘‘ప్రతి మనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమా చారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగా బైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్. చెర్నోబిల్ దుర్ఘ టన, సోవియట్ పతనం, సోవియట్– అఫ్గానిస్తాన్ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్ భాషలో రాసే ఈ బెలారూస్ పాత్రికేయురాలు నోబెల్ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’ (ఒరిజినాలిటీ లేకుండా పోవడం) నిండిపోయివుంది. వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకు ముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు. యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకో గలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి. జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి. నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వే గపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవనసంగీతమే ప్రపంచంలో వ్యాపిస్తున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు. -
ఉదయ్‌కిరణ్, తరుణ్‌లతో నన్ను పోల్చకండి : వరుణ్ సందేశ్
Varun Sandesh : హ్యాపీడేస్ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఆటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్‌ను తరుణ్, ఉదయ్‌కిరణ్‌లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్, తరుణ్ బాగా తెలుసు. ఉదయ్‌కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్‌ను అలా పోల్చి చూడలేం. ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్‌బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కానీ కోవిడ్ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్ వెళ్లి ఐటీ కోర్స్ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్ వివరించాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. -
ఏపీ బడ్జెట్: గతేడాది కన్నా రెట్టింపు కేటాయింపులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక కేటాయింపులు చేసింది. అసెంబ్లీ సమావేశంలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొన్ని శాఖల వారీగా గతేడాది (2020-21) కేటాయింపులు.. ఈ ఏడాది కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఈబీసీ సంక్షేమం 8 శాతం అధిక కేటాయింపులు ఈ ఏడాది (2020-21) రూ.5,478 కోట్లు గతేడాది (2020-21) రూ.5,088.55 కోట్లు కాపు సంక్షేమం 2020-21లో రూ.3,090 కోట్లు ఈ ఏడాది రూ.3,306 కోట్లు. మొత్తం 7 శాతం అధిక కేటాయింపులు బ్రాహ్మణుల సంక్షేమం 2020-21లో రూ.124 కోట్లు ఈ ఏడాది రూ.359 కోట్లు 189 శాతం అత్యధిక కేటాయింపులు ఎస్సీ ఉప ప్రణాళిక 22 శాతం అధిక కేటాయింపులు చేశారు. ఈ ఏడాది రూ.17,403 కోట్లు గతేడాది రూ.14,218 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక ఈ ఏడాది రూ.6,131 కోట్లు కేటాయింపు.. ఇది గత ఏడాది కంటే 27 శాతం అధిక కేటాయింపు గతేడాది: రూ.4,814 కోట్లు మైనార్టీ యాక్షన్ ప్లాన్‌తో పాటు మైనార్టీ ఉప ప్రణాళికలో కేటాయింపులు భారీగా పెంచారు. మొత్తం 27 శాతం అధిక కేటాయింపులు ప్రభుత్వం చేసింది. ఈ ఏడాది మొత్తం కేటాయింపులు రూ.3,840.72 కోట్లు 2020-21లో రూ.1,634 కోట్లు -
సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్ నీట్-2020 పరీక్షలలో టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతనికి నీట్లో 720 కి 720 మార్క్‌లు వచ్చాయి. అయితే అతనితో సమానంగా ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ కూడా ఫుల్ మార్క్ తెచ్చుకుంది. ఇద్దరికి సరిసమానమైన మార్క్‌లు వచ్చినప్పటికి సోయబ్ టాపర్‌గా నిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే నీట్ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారికి ర్యాంక్ కేటాయించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదటగా పరిశీలించేది వారి బయాలజీ మార్క్‌లు, అక్కడ కూడా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వస్తే రసాయన శాస్త్రంలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూస్తారు. ఆ తరువాత ఎవరికి ఎక్కువ నెగిటివ్ మార్క్‌లు వచ్చాయో పోలుస్తారు. అప్పటకి ఇద్దరు సమానంగా ఉంటే వయసును లెక్కిస్తారు. ఈ ఏడాది నీట్ టాపర్స్ ఇద్దరు అన్నింటిలో సమానంగా మార్క్‌లు తెచ్చకున్నప్పటికి ఆకాంక్ష సింగ్ సోయబ్ కంటే చిన్నది. అందుకే పెద్ద వాడు అయిన సోయబ్‌నే ఆల్ ఇండియా నీట్ ర్యాంకర్ 1 గా ప్రకటించారు. ఇలా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారి వయసులను పరిశీలించి ఎవరు పెద్దవారైతే వారికే మొదటి ర్యాంక్‌ను కేటాయిస్తారు. ఈ కారణంగానే సోయబ్ టాపర్‌గా నిలిచాడు. చదవండి: నీట్ ఫలితాల వెల్లడి -
ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి
వేంపల్లె: ఎన్టీఆర్, చంద్రబాబుకు పోలికే లేదని, వారి మధ్య సతీ సావిత్రికి, చింతామణికి ఉన్నంత తేడా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఇతర పార్టీల వారు టీడీపీలో చేరదలుచుకుంటే ఆ పార్టీల పరంగా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేసిన తర్వాతనే టీడీపీలోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ తీర్మానం చేశారన్నారు. నేడు ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. -
పోలికలికలు
కవలలని చూడండి. ఎత్తు పొడుగు రూపూ రంగు... అన్నీ ఒకేలా ఉన్నా ఒకరితో ఒకరిని పోల్చితే ఒకరు తక్కువా ఒకరు ఎక్కువా అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు స్ఫూర్తి కలిగించడానికి పేరెంట్స్ తరచూ వాళ్లను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. అది తోబుట్టువులతో కావచ్చు... పక్కింటి పిల్లలతో కావచ్చు.... క్లాస్‌మేట్స్‌తో కావచ్చు.... అలా పోల్చడం వల్ల పిల్లల మనస్థయిర్యం కుంటుపడి తరచూ నైరాశ్యంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి పోల్చక పోతే పిల్లలు ఎలా ఎదగాలి? దీనికీ మంచి సమాధానమే ఇస్తున్నారు. పేరెంట్సే ఒక ఉదాహరణ కావాలి. పేరెంట్స్ ప్రవర్తనే ప్రోత్సాహం కావాలి. పేరెంట్స్ నడవడికే స్ఫూర్తి కావాలి. గాంధీజీ, నేతాజీ, నెహ్రూజీ.. భారతావనికి పేరుతెచ్చిన ఇలాంటి ఎందరో మహనీయుల గురించి పిల్లలకు చెప్పడం అంటే వారి అడుగుజాడల్లో కొంతమంచినైనా భావితరానికి పంచుతున్నామన్నట్టే. కానీ, తోబుట్టువునో, పక్కింటి అబ్బాయినో, ఇరుగింటి అమ్మాయినో ఉదాహరణగా చూపిస్తూ -‘నీ వయసే కదా..! నువ్వూ అలా ఉండచ్చు కదా!’ అనడమో.. ‘నీ క్లాసే కదా, ఎప్పుడూ క్లాస్ ఫస్టే.. నువ్వూ ఉన్నావు ఎందుకు తిండి దండగ...’ అని తిట్టడమో చేస్తున్నారంటే కచ్చితంగా పిల్లల భవిష్యత్తుకు కీడు తలపెడుతున్నారన్నమాటే. అందుకు ఈ రెండు ఉదాహరణలే నిదర్శనం.... తోబుట్టువుల్లో ‘పోలిక’ పెద్ద సమస్య... రాకేష్- రవి ఇద్దరూ కవలపిల్లలు. ఇద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ సాప్ట్వేర్ ఇంజినీర్లవడంతో పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు. రాకేష్ అన్నింటా ఫస్ట్ వస్తుండటంతో స్నేహితులు, టీచర్లు..‘రవీ, మీరిద్దరూ ఒకేసారి పుట్టారు. ఒకేలా ఉంటారు. కానీ, రాకేష్‌లా ఎందుకు చదవవు’ అనేవారు. ఇంట్లో ఇలాంటి పోలికలేవీ లేకపోవడంతో ఆ మాటలను రవి పట్టించుకునేవాడు కాదు. కానీ, ప్రతీసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌లో తల్లిదండ్రులతో ‘రాకేష్ అన్నింటా బెస్ట్, రవినే ఇంప్రూవ్ చెయ్యండి’ అనేవారు టీచర్లు. దీంతో కొన్నాళ్లుగా ఇంట్లో కూడా తల్లిదండ్రులు ‘అన్నయ్య చేయగలిగిన పనిని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు.. అన్నయ్యను చూసైనా నేర్చుకో’ అంటుండేవారు. ప్రతీ చిన్న దానికీ పోలిక ఎక్కువైంది. అప్పటిదాకా కొంతవరకే వెనకబాటులో ఉండే రవి ఇంకా వెనకబడిపోయాడు. ఏ పని చేయాలన్నా అన్నయ్యలాగా సవ్యంగా చేయలేనేమో అనే భయపడేవాడు. అన్నయ్య లాగా మార్కులు రావు అనే భయంతోనే స్కూల్‌కి సరిగా వెళ్లడం లేదు. ఇంట్లోనూ చిన్నపాటి దొంగతనాలు కూడా చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నాడు. దీంతో తల్లిదండ్రి నిపుణులను కలిశారు. ‘దీనినే ఇంటర్ పర్సన్ కంపేరిజన్ అంటారు’ అన్నారు పిల్లల మనస్తత్వ నిపుణులు. ‘తోబుట్టువులతో పోల్చి చూపితే బాగుపడతారు అనుకుంటారు. కానీ, అది వారిని మరింత కృంగిపోయేలా చేస్తుంది’ అని చెబుతున్నారు సైకియాట్రిస్ట్ డా.కల్యాణ్. రవికి కౌన్సెలింగ్ చేసిన డాక్టర్ రవి ఏమన్నాడో చెబుతూ- ‘అంకుల్, ప్రతీసారి అన్నయ్యలాగా అలా ఉండు, ఇలా ఉండు అంటారు. నేనెంత మంచి పని చేసినా ఎవరూ మెచ్చుకోరు. అదే చెడ్డ పనులు చేస్తే త్వరగా గుర్తిస్తున్నారు. ఇదే బాగుంది కదా!’ అన్నాడు. ఈ ప్రవర్తననే కాండక్ట్ డిజార్డర్ అంటాం. రవితో పాటు తల్లిదండ్రులకు, అన్నకి కూడా ఆరునెలలుగా కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తోబుట్టువులతో పోల్చి చూడటం అందరిళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఆ ‘పోలికే’ వారి ఎదుగుదలలో అసాధారణ ప్రభావాలను చూపుతుంది’ అని వివరించారు డా. కళ్యాణ్. గతాన్ని ప్రస్తుత కాలంతో పోల్చడం తగదు షైని తొమ్మిదో క్లాస్. టెన్నిస్ అంటే ప్రాణం. టోర్నమెంట్ గెలవాలనే ఆలోచనతో స్కూల్‌కెళ్లకుండా ప్రాక్టీస్మీదే దృష్టి పెట్టేది. అయినా, టీచర్లు, పేరెంట్స్ ఆమెను ప్రోత్సహించేవారు. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. దీంతో ప్రాక్టీస్‌లో వెనకబడింది. కోచ్, పేరెంట్స్ ఆమె వెనకపడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘ఇది వరకు ఎంత బాగా ఆడేదానివి, ఇప్పుడిలా అయిపోయావేంటి..’ అంటుండేవారు. ఫిజికల్ పిట్నెస్ బాగైనప్పటికీ పదే పదే ఈ మాటల వల్ల ఆమె మెంటల్ ఫిట్నెస్ను దెబ్బతీశాయి. దీంతో ‘నేను చాలా వెనకబడిపోయాను, గెలవలేను’ అని ఆత్మన్యూనతతో టోర్నమెంట్ వరకు వెళ్లి, అందులో పాల్గొనకుండానే ఇంటికి వచ్చేసింది. టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసింది. చదువులోనైనా రాణిద్దామని స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టింది. కానీ, ఆశించిన మార్కులు, గుర్తింపు రాలేదు. దీంతో ఎందులోనూ రాణించలేను అని తనపై తను నమ్మకం కోల్పోయింది. బాగా డెప్రెషన్కు లోనై, ఇమ్యూనిటీ తగ్గి, స్వైన్‌ఫ్లూ బారిన పడింది. దీనినే ‘ఇంట్రా పర్సన్ చైల్డ్ కంపేరిజన్’ అంటున్నారు సైకియాట్రిస్ట్‌లు. అంటే, పిల్లలను ప్రోత్సహించాలి అని గతానికి- నేటికీ పోల్చి చూపడం అన్నమాట. షైని సాధారణ స్థితికి రావడానికి రెండేళ్లు పట్టింది. శక్తికి మించిన భారాన్ని మోపి ‘పోలిక’ వద్దు... పిల్లలు మాట వినడం లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నారు. తమ కుటుంబ స్థితి ఏంటో తెలుసు కోవడం లేదు. మార్కులు సరిగా రావడం లేదు. ఏం చేయాలి...??! ఇలాంటప్పుడే ‘పోలిక’ మంత్రం మైండ్లోకి వస్తుంది. ఆ పదాన్ని పిల్లల ఎదుట పదే పదే నోరు ఉచ్చరిస్తుంది. దీంతో పాటు తరచూ ఉపయోగించే ‘పోలిక’... తల్లిదండ్రులు తమ కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. దీంతో పిల్లల శక్తికి మించిన భారాన్ని మోపి, దాంట్లో వారు అనుకున్నస్థాయిలో విజేతలు కానప్పుడు ఆందోళన చెందుతారు. అప్పుడే ‘గతంలో మేం కనీస వసతులు లేకుండా ఎలా చదువుకున్నామో తెలుసా! ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఈ మాత్రం సాధించలేకపోతున్నావు’ అంటూ తమ గతానికి- పిల్లల ప్రస్తుతానికి కంపేరిజన్ చేస్తూ మాట్లాడతారు. ఇది సాధారణంగా అందరి ఇళ్లలోనూ చూస్తుంటాం. ఇక కొందరు పేరెంట్స్ అప్పటి వరకు ఒక మాదిరి కాలనీలలో ఉండి పిల్లల కోసం హైలొకాలిటీకి మారుతారు. పిల్లలకు హై సొసైటీని పరిచయం చేయాలనే తాపత్రయంతో. అక్కడకు చేరాక ‘మీరు కూడా ఈ కాలనీలోని పిల్లల్లాగే ఉండాలి’ అని చెబుతారు. దీంతో గత వాతావరణం.. అక్కడి పిల్లలు, ప్రస్తుత వాతావరణం.. ఇక్కడి పిల్లల ప్రవర్తన.. వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.మరికొందరు పేరెంట్స్ మామూలుగా చదివే తమ పిల్లవాడిని చాలా స్ట్రిక్ట్‌గా ఉండే స్కూల్లో చేర్పిస్తారు. అక్కడి పిల్లల్లాగే చదవమని ఒత్తిడి చేస్తుంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ పిల్లల స్టడీ గ్రాఫ్ కొద్దిగా పడిపోయినా చాలు భవిష్యత్తులో వారు చేరబోయే కోర్సుల్లో సరిగ్గా రాణించలేరని ఇప్పుడే భయపడుతూ తోటివారితో కంపేర్ చేస్తుంటారు. దీనిని ‘పేరెంటల్ యాంగ్జైయిటీ కంపేరిజన్’ అంటారు. పిల్లల మనస్తత్వం అర్థంకాకుండా ఉంటే నిపుణుల సూచనలు తీసుకోండి. మీ కాలనీ, అపార్టమెంట్లలో నెలకు ఒకసారైనా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి, నిపుణుల చేత అర్థమయ్యేలా స్పీచ్ ఇప్పించండి. మీ అబ్బాయి చదివే స్కూల్లో పేరెంట్-టీచర్ మీటింగ్ సమయంలోనూ నిపుణుల చేత ఈ తరహా క్లాసులు నిర్వహించడం అందరికీ మేలు చేస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేయండి. పోలిక లేకుండానే మీ పిల్లలను విజేతలుగా నిలపండి. - సాక్షి ఫ్యామిలీ మంచి కన్నా చెడే అధికం... పోలిస్తే పోయేదేముందిలే అనుకుంటారు. కానీ, పోయేది మీ పిల్లల భవిష్యత్తే. ఎదుటివారితో పోల్చినప్పుడు ‘వారి’లా నేను సాధించలేను అనే ‘నెగిటివ్ ఎఫెక్ట్’ పిల్లవాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సొంతంగా ఆలోచించే శక్తి సన్నగిల్లుతుంది. దీంతో ప్రపంచంలో ఏం జరుగుతుంది... ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అని తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుంది.కంపేరిజన్ అధికంగా ఉన్న వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తరచూ డిప్రెషన్‌కి వెళ్లే ప్రమాదం ఉందని, వారి మీద వారు నమ్మకం కోల్పోవడం వల్ల భయం, ఆందోళనలతో ఏ పనినీ సవ్యంగా చేయలేక నిస్తేజంగా మారిపోతారని’ అమెరికన్ మెంటల్ హెల్త్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. పోల్చకుండా పిల్లలను అభివృద్ది వైపు నడిపే మార్గాలు ముందు గుర్తుంచుకోవాల్సింది... మీ పిల్లలు అందరి పిల్లల్లా కాదు అని.మీ పిల్లల కళ్ల ద్వారా ప్రపంచాన్ని చూడాలే తప్ప, మీ కళ్ల ద్వారా వారి ప్రపంచాన్ని చూడాలనుకోకూడదు. పిల్లలు ఎలా ఉన్నారో అలాగే వారిని అంగీకరించండి. నడకరాని పిల్లవాడు తనకు తానుగా నడక నేర్చుకున్నట్టు.. పడిపోతుంటే మీ వేలును అందించేలా ఉండండి. పిల్లల్లో ఉన్న బలాలను ముందు చెప్పాకే తర్వాత లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పండి. పిల్లల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, బలహీనతలు, జ్ఞాపకశక్తి.. ముందు వీటిని గుర్తించి సరిదిద్దండి. ఈ సమస్యలను కంపేరిజన్తో పారదోలచ్చు అనుకోకండి. పక్కింటి వారినో, ఎదురింటివారినో ఉదాహరణగా చూపడం కన్నా మీరే బెస్ట్‌గా పిల్లల ముందు నిలవండి. మాటలతో చెప్పడం కాకుండా మీ ప్రవర్తనతో ఆదర్శంగా నిలవండి. మానవ సహజంగా ఉండే బలహీనతలు, వాటిని అధిగమించడానికి ఉపయోగపడే నీతికథలు చెబుతూ ఉండండి. పిల్లలు ఎప్పుడెప్పుడో చేసిన అన్ని తప్పులను ఒకేసారి వేలెత్తి చూపకుండా అప్పటి ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకొని హెచ్చరిస్తే మంచిది. - ఇన్పుట్స్: డా.కల్యాణ్, చైల్డ్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్ -
పోలిక మంచిదే: హృతిక్ రోషన్
ముంబై: పోలిక మంచిదే అంటున్నాడు బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్. తన క్రిష్ ౩ సినిమాను హాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ 'ఎక్స్ మెన్'తో పోల్చడాన్ని హృతిక్ స్వాగతిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాలతో పోల్చడం బాలీవుడ్ సినిమాలకు మంచిదేనని పేర్కొన్నాడు. సూపర్ హీరో తరహా సినిమాలను భారతీయులకు ఏవిధంగా తెరకెక్కిస్తారనే ఉత్సుకత ప్రపంచమంతా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మనదేశంలో తెరకెక్కిన తొలి సూపర్ హీరో సినిమా ఇదని తెలిపాడు. కాస్ట్యూమ్స్‌తో మొత్తంగా చూస్తే క్రిష్ 3... 'ఎక్స్ మెన్'ను పోలివుంది. ఇక కంగనా రౌనత్ పోషించిన పాత్ర 'ఎక్స్ మెన్'లో హలీబెరీ పాత్రను తలపిస్తోంది. వివేక్ ఒబరాయ్ విలన్ పాత్రలో నటించాడు. కాల్ పాత్రను అతడు పోషించాడు.