పిల్లలపై వేధింపులకు పాల్పడితే పీడీ చట్టం
గత 40 ఏళ్లుగా 140 దేశాల్లో పర్యటించి పిల్లలు, మహిళల సంరక్షణకు సత్యార్థి పోరాడుతు న్నారని కొనియాడారు. పిల్లలు, మహిళల కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాలు తెస్తామన్నారు. పిల్లలపై లైంగిక హింస ఘటనలు దారుణమని సత్యార్థి అన్నారు. ఏపీఎస్‌పీ బెటాలియన్ గ్రౌండులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో లైంగిక వేధింపులు, బాలికలపై అసభ్య ప్రవర్తన వంటి కేసులు 15 వేలు నమోదు కాగా... 4 శాతం పరిష్కారం అయ్యాయన్నారు.
బుద్ధుడు, గాంధీ పుట్టిన ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు మనకు చెంపపెట్టులాంటివన్నారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాపై తాను 11 వేల కిలోమీటర్ల మేర 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా భారతయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సత్యార్థి 80 వేల మంది పిల్లలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ తెలిపారు. మరోవైపు సీఎం పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించారు. సభ కాస్తా మధ్యాహ్నం రెండు గంటల వరకూ కొనసాగడంతో పిల్లలు ఆకలితో అలమటించారు.