ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మినీ లారీని సీజ్ చేసి... డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.