గుంటూరు ఎడ్యుకేషన్: డీఈడీ కోర్సులో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీ-సెట్) సజావుగా జరిగింది. జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసిన 7,326 మంది విద్యార్థులకు 6,594 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరందరికీ గుంటూరు నగరంలోని వివిధ విద్యాసంస్థల్లో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రానికి దూరంగా పల్నాడులోని మాచర్ల, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం 9.00 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు విధించిన నిబంధన విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. తెలుగు మాధ్యమంలో దరఖాస్తు చేసిన 7,014 మందికి 6,297 మంది, ఉర్దూమాధ్యమంలో దరఖాస్తు చేసిన 3012 మందికి 297 మంది హాజరయ్యారు.
అధికారుల తనిఖీలు
డీసెట్ పరీక్షా కేంద్రాలను అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు నగరంలోని పలు కేంద్రాలను సందర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, జీఎస్సార్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, పాతగుంటూరులోని యాదవ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశాయి.
సజావుగా డీ-సెట్
Published Mon, Jun 16 2014 12:02 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement