అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందే
నెల్లూరు(పొగతోట): జిల్లాలో పరిశీలన పేరుతో 16,563 పింఛన్లు తొలగించారని, వారిలో అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన ‘స్థాయీ సంఘాల’ సమావేశం ని ర్వహించారు. పింఛన్ల తొలగింపుపై సభ్యులు ధ్వజమెత్తారు. ప్రతి గ్రామం లో అర్హుల పింఛన్లు తొలగించారని అ ధికారుల దృష్టికి తెచ్చారు.
అర్హుల పింఛన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. గ్రామ కార్యదర్శుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రక్రియ చేపట్టాలని జెడ్పీ తీర్మానించింది. ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మండల కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. పథకాల అమలు లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం లే దన్నారు. అలాంటి వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతా ల్లో రోడ్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి బోర్లకు మరమ్మతులు పూర్తి చేయాలని సూచిం చారు. గొర్రెలకు సంబంధించి బీమా పథకం కింద 5 వేల మంది అర్హులు స ద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి రూ.1.10 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ నిధుల వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. వాగులు, కుంటల నుంచి గృహాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాల న్నారు. పథకాల అమలులో జాప్యం చేయకుండా అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో రికవరీ చేయాలన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
పనులన్నీ ఆయనకేనా?
జిల్లా జరుగుతున్న పనులు ఒకే ఒక్కరికి కేటాయిస్తున్నారని, దీంతో పనుల్లో నాణ్యత లోపించిందని జెడ్పీలో చర్చిం చారు. ఆ పనులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సభ్యులు డి మాండ్ చేశారు. ఐదేళ్ల నుంచి ప్రతి పనిని ఆయనకే కేటాయిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ గౌతమి, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు పురుషోత్తమ్, రామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.