
అనుమానం... పెనుభూతమై
- - పాడిపేటలో యువకుడి హత్య
తిరుచానూరు: అనుమానం పెనుభూత మై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్యచేసి ఇసుకలో పాతిపెట్టారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం పాడిపేట అరుంధతివాడలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు..
గుంటూరుకు చెందిన అమ్ములు, ఆరుముగం దంపతులతో పాటు మరి కొన్ని కుటుంబాలు ఏడేళ్ల క్రితం పాడిపేట అరుంధతివాడకొచ్చి స్థిరపడ్డా యి. వీరు ఇటుకల బట్టీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అమ్ము లు తమ్ముడు అయిలు(25) భార్యతో గొడవపడి సుమారు నెల తన అక్క ఇంటికి వచ్చాడు. ఇక్కడే కూలి పనులు చేసుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే లక్ష్మి, ఆమె భర్త శివాజీ కాపురం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వీరు గొడవపడి వేరుగా ఉంటున్నారు. లక్ష్మి అయిలుకు వరుసకు బావ కూతురు.
ఈ కారణంగా అతను లక్ష్మితో స్నేహంగా ఉండేవాడు. దీంతో శివాజీకి అనుమా నం వచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రోజురోజుకూ పెరిగింది. అయిలును హతమార్చాలని నిర్ణయిం చుకున్నాడు. గురువారం సాయంత్రం గుంతలు తవ్వే పనుందని అయిలును ఇంటి నుంచి శివాజీ తీసుకెళ్లాడు. అరుంధతివాడకు సమీపంలోని స్వర్ణముఖినది పరీవాహక ప్రాంతానికి తీ సుకెళ్లి అయిలుకు మద్యం తాపించా డు. మద్యం మత్తులో ఉన్న అతని తల పై రాయితో కొట్టి హతమార్చాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి లాక్కెళ్లి ఇసుకలో పూడ్చి పరారయ్యాడు.
అర్ధరాత్రి అయినా అయిలు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో అమ్ము లు, ఆరుముగం, బంధువులు వెతికారు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్తున్న కొందరు రక్తపు మరకలు, మృతదేహాన్ని లాక్కెళ్లిన ఆనవాళ్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐలు సూర్యనారాయణ, చిరంజీవి, ఏఎస్‌ఐ శంకర్, సిబ్బంది అక్కడి చేరుకున్నారు.
రూరల్ తహశీల్దార్ యుగంధర్, ఆర్‌ఐ శ్యాం, వీఆర్వో రవి, తలారి సాంబ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. శివాజీ, అతని మిత్రుడు మురగ కలిసి అయిలును హత్యచేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని సీఐ రామకృష్ణాచారి తెలిపారు.