కదిరి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పదవులకు, పార్టీలకు రాజీనామా చేయకుండా మభ్యపెడుతున్న రాజకీయ నాయకుల వైఖరిని జనం సహించలేకపోతున్నారు. బుధవారం కదిరిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జేఏసీ ఏర్పాటు చేసిన సభకు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. జేఏసీ నేతల ప్రసంగాలను ఎంతో ఓపికగా కూర్చుని విన్నారు. ఈలోగా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వేదికపైకి వెళ్లారు.
వెంటనే అంతసేపు ఓపికగా కూర్చుని ఉన్న వారు వెంటనే లేచి వెళ్లిపోయారు. ‘మీ పదవి, పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనండి. అప్పుడు మాకెలాంటి అభ్యంతరం లేదు. అందాక మీ మొహాలు మాకు చూపకండి.. వేదికపై నుంచి దిగిపోండి.. మీ కల్లబొల్లి మాటలు వినే ఓపిక మాకు లేదు’ అని మహిళలు కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు వినకుండా వెళ్లిపోయారు. కూర్చోండమ్మా అని వారు బతిమలాడుకున్నా వినలేదు. వేదిక ఎక్కిన నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా ఉన్నారు.
మీ మొహాలు చూడలేం
Published Thu, Aug 15 2013 4:41 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement