టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు | people not giving intrest to tdp | Sakshi
Sakshi News home page

టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు

Published Fri, May 29 2015 4:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు - Sakshi

టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు

నగరి : టీడీపీని ఏడాదికే రాష్ట్ర ప్రజలు ఛీకొట్టారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ కట్టపై ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరి, పుత్తూరు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు రైతు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్లను తరిమివేయాడానికి పోరాడారని, చంద్రబాబు, మోదీ బ్రిటిష్ వాళ్లను భారత్‌కు తీసుకురావడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ప్లాన్, మన రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని, అయితే ఏకంగా రాష్ట్ర రాజధాని ప్లాన్‌నే విదేశీయుల చేతుల్లో పెట్టడం పద్ధతి కాదని చెప్పారు.

సాగు చేస్తున్న భూములను రాజధాని రైతులను దౌర్జన్యం చేసి టీడీపీ లాక్కుంటోందని విమర్శించారు. తెలంగాణ విభజన రోజే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి, పథకాల అభివృద్ధి కోసం రూ.5లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. అనంతరం పుత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులురాలు హిందుమతి ఇంటిలో తేనీటి విందు తీసుకొన్నారు.

పుత్తూరు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ వెన్ను విరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ తులసిరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, డాక్టర్ నరసింహులుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement