The state people
-
ప్రజల గోడు పట్టని ప్రభుత్వం
- 3లక్షల కార్డుల తొలగించేందుకు యత్నం - ఎమ్మెల్యే నారాయణస్వామి ఆవేదన పెనుమూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా సర్కారుకు చీమకుట్టినంత కూడా లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు,గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి మండిపడ్డారు.శనివారం మండలంలోని కత్తిరెడ్డిపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామంటున్న ప్రభుత్వం త్వరలో జిల్లాలో 3 లక్షల రేషన్‌కార్డులను తొలగించి పేదల నోట్లో మట్టికొట్టనుందని చెప్పారు. ప్రజల బాగోగులు మరిచి ఇతరులపై బురద జల్లేందుకు కొన్ని పత్రికలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను 20 వేల ఓట్లతో ఓడిపోతానంటూ దుష్ర్పచారం చేసిన ఎల్లో మీడియా ఎన్నికలయ్యాక 20 వేల ఓట్లతో గెలిచినట్లు గుర్తు చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా తాను ఎమ్మెల్యేగా ఫైయిల్ అని సర్వే చేసి ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు. తనపై తప్పడు సంకేతాలు ప్రజలకు చేరవేస్తున్నట్లు అసహనం వ్యక్తం చేశారు.అసలు ఈ సర్వే ఎలా చేశారు.. ఎవరినుద్దేశించి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు అవసరం వచ్చినా తక్షణమే స్పందిస్తున్నట్లు తెలిపారు. కుట్రలతో తనకున్న ప్రజాదరణను అడ్డుకోలేరని హితవు పలికారు. పార్టీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నరిసింహారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, నాయకులు మార్కొండారెడ్డి, కొర్రావీర్రాఘవులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు
నగరి : టీడీపీని ఏడాదికే రాష్ట్ర ప్రజలు ఛీకొట్టారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ కట్టపై ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరి, పుత్తూరు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు రైతు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్లను తరిమివేయాడానికి పోరాడారని, చంద్రబాబు, మోదీ బ్రిటిష్ వాళ్లను భారత్‌కు తీసుకురావడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ప్లాన్, మన రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని, అయితే ఏకంగా రాష్ట్ర రాజధాని ప్లాన్‌నే విదేశీయుల చేతుల్లో పెట్టడం పద్ధతి కాదని చెప్పారు. సాగు చేస్తున్న భూములను రాజధాని రైతులను దౌర్జన్యం చేసి టీడీపీ లాక్కుంటోందని విమర్శించారు. తెలంగాణ విభజన రోజే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి, పథకాల అభివృద్ధి కోసం రూ.5లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. అనంతరం పుత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులురాలు హిందుమతి ఇంటిలో తేనీటి విందు తీసుకొన్నారు. పుత్తూరు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ వెన్ను విరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ తులసిరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, డాక్టర్ నరసింహులుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.