నెల్లూరు(క్రైమ్): ‘నా భర్త నుంచి నాకు, నా బిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పించండి. భర్త, అత్తింటి వారు వేధిస్తున్నారు. కుమార్తెను మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఆస్తి కోసం కుమారుడు హింసిస్తున్నాడు’.. ఇలా ఒక్కొకక్కరిది ఒక్కో కన్నీటి గా ద. తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు కన్నీటి పర్యంతంగా పోలీసు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తమ కన్నీటి కష్టాలను చెప్పుకున్నారు. వారు వాటిని పరిశీలించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా, సీసీఎస్, ట్రాఫిక్ డీఎస్పీలు పి. శ్రీధర్, ఎం.బాలసుందరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
అత్తింటివారిపై చర్యలు తీసుకోండి
నా తల్లిదండ్రులు చేనేత పనులు చేసి నన్ను కష్టపడి చదివించారు. నా కుటుంబ సభ్యులు మా పక్కింట్లో నివాసముంటున్న సుజాత తమ్ముడు సాయికుమార్‌తో 2014లో వివాహం చేశారు. ఆ సమయంలో సాయికుమార్, అతని అక్కలు నన్ను చదివిస్తానని నమ్మబలికారు. వివాహమైన రెండు నెలలు బాగా చూసుకున్నారు. అనంతరం నా భర్త, అత్త ఇద్దరు కలిసి నన్ను అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇతరులతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి వే«ధించి.. ఇంట్లో నుంచి తరిమేశారు. విచారించి న్యాయం చేయండి. – బి.మాధవిఅలియాస్ సుప్రజ, వెంకటగిరి
ఆస్తి కోసం కొడుతున్నాడు
నా కుమారుడు ప్రసాద్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తిలో అధిక శాతం నా కుమారుడికి ఇచ్చాము. నేను, నా భర్త ఉండేందుకు ఇంటిని, కొంత పొలాని ఉంచుకున్నాం. అయితే ఆస్తిని తన పేరుపై రాసివ్వాలని కుమారుడు చిత్రహింసలు పెడుతున్నాడు. ఇటీవల కొట్టడంతో కాళ్లు వి రిగాయి. కుమారుడి చేష్టలపై దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు పట్టించుకోలేదు. కుమారుడి బారి నుంచి నాకు రక్షణ కల్పించండి.– చల్లా సుబ్బమ్మ, ఉప్పలపాడు,దగదర్తి మండలం
కుమార్తె ఆచూకీ తెలియచేయండి
నా కుమార్తె జయలక్ష్మిని మా ప్రాంతానికి చెందిన జీవన్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అతనికి ఇది వరకే వివాహమై పిల్లలు ఉన్నారు. గత నెలలో నా కుమార్తెను తీసుకెళ్లిపోయాడు. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని మందలించి నా కుమార్తెను మే 21న నా ఇంటికి పంపారు. ఆ మరుసటి రోజే జీవన్ మళ్లీ నా కుమార్తెను తీసుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశా పట్టించుకోవడం లేదు. విచారించి నా కుమార్తె ఆచూకీ తెలియచేయండి. – ఎం. చంద్రిక,మైపాడుగేటు, నెల్లూరు
మా ప్రాణాలకు రక్షణ కల్పించండి
నాకు నా భర్త అహ్మద్‌బాషాకు విభేదాలు రావడంతో నన్ను తీవ్రంగా కొట్టాడు. అతని వేధింపులు తాళలేక చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నా భర్తపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా నా భర్తతో విడిపోయి కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గత కొంతకాలంగా నా భర్త అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వచ్చి నన్ను, నా కుమార్తెను తీవ్రంగా కొడుతున్నాడు.. నన్ను, నా కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతని బారి నుంచి మా ప్రాణాలకు రక్షణ కల్పించండి. – ఎస్‌కే యాస్మిన్, మన్సూర్‌నగర్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment