ఏపీలో డీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి | Permission to the DEd spot admission in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో డీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి

Published Sun, Jan 31 2016 7:21 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Permission to the DEd  spot admission in AP

-2014-15 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్ధులకు అవకాశం
 హైదరాబాద్

ఏపీలో డీఎడ్ 2014-15 బ్యాచ్ ఫస్టియర్‌లో ప్రయివేటు కాలేజీలు చేపట్టిన స్పాట్ అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 28 డీఎడ్ కాలేజీలు కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన 168 సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీచేసుకున్నాయి.


 ఈ విద్యార్ధులను ఫస్టియర్ పరీక్షలకు అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో సంబంధిత కాలేజీలు నిర్ణీత అపరాధ రుసుము, పరీక్ష ఫీజులను సోమవారమే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఆదివారం ఆర్సీ నెంబర్ 53/సీ1/2015ను విడుదల చేశారు.


 ఆయా కాలేజీలు విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను, ధ్రువపత్రాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఈ అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్లు జారీచేయాల్సి ఉన్నందున తక్షణమే చెల్లింపులు, నామినల్‌రోల్స్‌ను సమర్పించాలన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement