వెబ్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ (డిగ్రీ/ డిప్లొమా) కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు ఏప్రిల్ మూడో వారంలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ టి.రవిరాజు మంగళవారం తెలిపారు. పారా మెడికల్ కౌన్సెలింగ్ మాదిరిగా పీజీ మెడికల్‌కు ఈ ఏడాది వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు మే ఒకటో తేదీకి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మే 30వ తేదీకి పూర్తి చేస్తామన్నారు.
ఏప్రిల్‌లో పీజీ మెడికల్ కౌన్సెలింగ్..
Published Wed, Mar 16 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM