హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్లదే కీలకపాత్ర అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కొనియాడారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ములుగురోడ్డులోని కేఎస్‌ఆర్ గార్డెన్‌సలో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు ఎంతో సాహసంతో పోరాట దృశ్యాలను చిత్రీకరించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్ కోసం కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగమూర్తి మాటాడుతూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని వారం రోజులపాటు ములుగు, తాడ్వాయి, కాటారం, సీపీ రెడ్డి కాంప్లెక్స్, వరంగల్‌లోని రెడిన్ కలర్‌ల్యాబ్‌లో నిర్వహించామని వివరించారు. హైదరాబాద్ వాసన్ ఐ ఆస్పత్రి ఆధ్వర్యం లో కంటివైద్య శిబిరం నిర్వహించామన్నారు. రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రథమ బహుమతి డి.వెంకన్న (నల్లగొండ జిల్లా కోదాడ ), ద్వితీయ బహుమతి ఆర్‌వీఎస్.శర్మ (ప్రకాశం జిల్లా ఒంగో లు), తృతీయ బహుమతిని హుస్సేన్ (ఖమ్మం) గెలుచుకున్నారని వెల్లడించారు.
భార్గవ్‌ఆర్గే (నిజామాబాద్), కోదాడి లక్ష్మణ్ (వరంగల్), గంగాధర్ (కరీమిల్ల నిజామాబాద్), వనం శరత్‌బాబు, సతీష్ (మహబూబాబాద్), కుమార్‌యాదవ్ (కరీంనగర్), అరుణ్‌కుమార్, నాగరాజు దేవర్ (ఖమ్మం) ప్రపంచస్థాయి సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ బండి రాజన్‌బాబు మెమోరియల్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, బాధ్యులు కె.మోహన్, సాంబయ్య, జి.సునీల్‌కుమార్, వి.రమేష్, దయాకర్, వాసుదేవరావు, ఇంద్రారెడ్డి, రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల న్యాయనిర్ణేతలు ఎం.రాంగోపాల్, కె.సుధాకర్‌రెడ్డి, జిల్లాకు చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ జయప్రకాష్, జిల్లా కార్యవర్గసభ్యులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
ఉద్యమంలో ఫొటోగ్రాఫర్లదే కీలకపాత్ర
Published Tue, Aug 20 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement