సీఎస్‌కు పోలవరం నిర్వాసితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం తమకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయిస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. ముంపు ప్రాంత గిరిజనులు శుక్రవారం డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిశారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ.. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు.
అలాగే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లానన్నారు. మరోవైపు పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వెంటనే జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్‌పర్సన్ రామేశ్వర్ ఓరాన్‌కు కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వి.కిశోర్ చంద్రదేవ్ లేఖలు రాశారు.
పరిహారం ఇవ్వకుండానే పొమ్మంటున్నారు
Published Sat, Dec 7 2013 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement