పోలవరం పనులు తక్షణమే చేపట్టాలి: రఘువీరా
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రమంత్రులను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను తక్షణమే చేపట్టాలని, సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రులను కోరామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు.
కేంద్రమంత్రులు సదానందగౌడ్, ఆశోక్ గజపతి రాజు, రాధామోహన్‌సింగ్‌లను సీమాంధ్ర కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు కలిశారు. ఎంపీల విజ్క్షప్తికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని ఎంపీలు తెలిపారు.