చిత్తూరు: పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే ఈ ఘోరం జరిగేది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. జిల్లాలోని యాదమరి మండలం వరిగపల్లిలో శుక్రవారం రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో విమలమ్మ అనే మహిళను తొక్కించి చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మృతురాలికి శ్రద్ధాంజలి ఘటించి తీవ్రంగా గాయపడిన ఆమె భర్త జగన్నాథరెడ్డిని పరామర్శించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపితే మాత్రం హౌస్ అరెస్టులు చేస్తారని, ఇలాంటి నేర సంఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకుంటే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సెక్షన్ 447,302,307,341, రెడ్‌విత్ 109 ఐపీసీల ప్రకారం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment