ఆశ తీరకుండానే అనంతలోకాలకు
Published Tue, Aug 20 2013 6:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
జమ్ము (విజయనగరం రూరల్), న్యూస్‌లైన్: కాయ కష్టం చేస్తూ తనను చదివిస్తున్న అమ్మానాన్నను సుఖపెట్టాలి... ఉన్నత స్థానానికి ఎదగాలని అందరిలాగా ఆ యువకుడూ పరి తపించాడు. వృద్ధ తల్లిదండ్రులు కష్టపడుతూ తనను చదివిస్తుంటే భరించలేకపోయాడు. తనకంటూ ఒక దిశను ఏర్పాటు చేసుకున్నాడు. పోలీస్ శాఖలో ఉద్యోగం పొం దేందుకు పరిశ్రమించాడు. ఫలితం లభించింది... ఆశయం సిద్ధించింది. అయితే దానిని అనుభవించేందుకు అదృష్టంలేకపోయింది. దురదృష్టం వెంటాడింది.
అనారోగ్య రూపం లో విధి అతనితో ఆడుకుంది. విధుల్లో చేరకుండానే మృత్యువు వెక్కిరించింది... ఏనాటికైనా సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలన్న ఆశ తీరకుండానే ఆ యువకుడు అనంతలోకాలకు చేరుకున్నాడు. పోలీస్ శాఖలో ఆర్‌ఎస్సైగా ఎంపికై విధి నిర్వహణలోకి రాకముందే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో ఆ యువకుని ఆశయం అర్ధాంతరంగానే ముగిసింది. ఉన్నత స్థాయికి కుమారుడు ఎదుగుతాడని ఆశించిన తల్లిదండ్రులు పుత్రశోకంతో కుమిలి పోతున్నారు. మృతుని కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం....
పట్టణ శివారు ప్రాంతం జమ్ముకు చెందిన పొదిలాపు ఉత్తరనాయుడు (29) నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. తల్లిదండ్రులు తవిటినాయుడు, అమ్మన్నలు వ్యవసాయ పను లు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఉత్తరనాయుడికి అన్నయ్యతో పాటు, ఇద్దరు అక్కలు ఉన్నారు. అన్నయ్య కూలి పని చేసుకుని జీవనం సాగిస్తుండగా.. అక్కలిద్దరికీ వివాహమైంది. చిన్న కుమారుడు కావడంతో ఉత్తరనాయుడును తల్లిదండ్రులు కాయా కష్టం చేసి డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ పూర్తియిన వెంటనే మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూతనందించాలని అతను భావించాడు. ఈ నేపథ్యంలో రైల్వే, ఆర్మీ, పోలీస్ శాఖల్లో కొలువు సాధించేందు కు తన వంతుగా ప్రయత్నం చేశాడు. ఆర్మీలో ఉద్యోగం వచ్చినప్పటికీ తల్లిదండ్రులకు దగ్గరుండి సేవలందించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
2010 సంవత్సరంలో పోలీస్‌శాఖలో ఆర్‌ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడంతో దరఖాస్తు చే సుకుని అన్ని విభాగాల్లో ఉత్తీర్ణత సాధిం చి అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు. 2012 ఆగస్టులో శిక్ష ణ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. శిక్షణ లో ఉండగానే ఆరో గ్య సమస్యలు తలెత్తాయి. దీంతో మధ్యలోనే స్వగ్రామానికి వచ్చేశాడు. అనంతరం ఎనిమిది నెలలుగా చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. రోగం నయం కాకపోవడంతో అక్కడ నుంచి సోమవారం ఉదయం స్వగ్రామానికి తీసుకువచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న కొద్ది సేపటికే ఉత్తరనాయుడు తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో భోరున విలపించా రు. చేతికి అందివచ్చిన కొడుకును మృత్యువు అనారోగ్యం రూపంలో కబళించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Advertisement
Advertisement