మాక్‌డ్రిల్‌లో భాగంగా పూడిమడక వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది
అచ్యుతాపురం: సముద్రమార్గంలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడంపై మాక్‌డ్రిల్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు మెరైన్, కోస్టుగార్డు సిబ్బంది ఉగ్రవాదుల మాదిరిగా సముద్రమార్గంలో ప్రయాణించి భూభాగంలోకి ప్రవేశిస్తారు. వారిని తీరప్రాంత పోలీసులు గస్తీ నిర్వహించి పట్టుకోవాలి. చొరబాటును అడ్డుకోకుంటే సదరు ఉగ్రవాదులు సంబంధిత సిబ్బంది దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చేరుకుంటారు. ఇలా చొరబాటును అడ్డుకోవడంపై మూడురోజుల మాక్‌డ్రిల్‌ను చేపడుతున్నారు.
దీంతో పోలీసులు తీరం నుంచి వచ్చే ప్రతివాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. పూడిమడక, తంతడి వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోలేకపోతే వారి విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉన్నతాధికారులు సమీక్షించి హెచ్చరిస్తారు. అయితే ఈ తతంగమంతా మాక్‌డ్రిల్ అని తెలియక మత్స్యకారులు పోలీసుల తనిఖీలతో భయపడుతున్నారు. తమ గ్రామం నుంచి ఎన్నిసార్లు బయటకు వెళ్లినా పోలీసులకు వివరాలను చెప్పాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment