న్యూఢిల్లీ: హజ్ యాత్రను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. హజ్ యాత్రికులు జెడ్డాకు చేరుకునేందుకు 23 ఏళ్ల క్రితం మూసివేసిన సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాలన్న భారత్ విజ్ఞప్తిని సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రి మహ్మద్ బిన్ ఆదివారం సంతకం చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. అయితే సముద్ర మార్గం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై పూర్తి సమాచారం తెలియలేదు. 1995 వరకు హజ్ యాత్రికులు ముంబైలోని మజ్‌గావ్ (ఎల్లో గేట్) నుంచి సౌదీలోని జెడ్డాకు ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవారు. అప్పట్లో ఈ ప్రయాణానికి సుమారు 12 నుంచి 15 రోజుల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం అత్యాధునిక ఓడలు అందుబాటులో ఉండటంతో యాత్రకు 4 రోజులు సమయం మాత్రమే పట్టనుంది.
మెహ్రం, లాటరీ లేకుండానే హజ్‌కు..
2018లో దాదాపు 1300 మంది భారతీయ మహిళలు పురుషుల తోడు లేకుండానే హజ్ యాత్రకు వెళ్లనున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. వీరందరినీ లాటరీ విధానం నుంచి తప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సముద్ర మార్గంలో హజ్ యాత్రకు సౌదీ అంగీకారం
Published Tue, Jan 9 2018 1:30 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment