mak drill
-
రైలు ప్రయాణంలో జాగ్రత్త సుమా!
హైదరాబాద్ : రైలు ప్రయాణికులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో వారు ఏవిధంగా మోసం చేస్తారో ఆర్పీఎఫ్ సిబ్బంది బేగంపేట రైల్వేస్టేషన్లో మాక్‌డ్రిల్ ద్వారా తెలియజేశారు. ప్రయాణికుల వద్దకు వచ్చి ఎలా పరిచయం చేసుకుంటారు, తినుబండారాలను ఏవిధంగా అందిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. మత్తుమందు కలిపిన తినుబండారాలు తిని ప్రయాణికులు ఏవిధంగా స్పృహ కోల్పోతారు, అనంతరం దుండగులు వారి వద్ద నుంచి నగదు, నగలు దోపిడీ చేసే విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. చిన్న పిల్లలను ఏవిధంగా లాలించి ఎత్తుకెళతారో ప్రదర్శన ద్వారా చూపించారు. మహిళా రక్షణ, బాలల అక్రమ రవాణా, డ్రగ్స్ రవాణా వంటి వాటిపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే టికెట్ వెనుక వైపు ఉన్న 182 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రైల్వేడీఆర్‌ఎం ఆశీష్‌అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం రైలులో జరిగే మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ క్రమంలో వారికి తెలియజేసేందుకు రైల్వే ఫ్లాట్‌ఫారంలపై ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. -
ఎయిర్‌పోర్టులో ఏమైంది
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమం.. మంగళవారం ఉదయం 9గంటలు.. భద్రతాదళాలు ఆందోళనగా అటూ ఇటూ పరుగెడుతున్నాయి..ఏం జరుగుతుందో తెలియడం లేదు. నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులంతా ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. ఏదో విపత్తు జరిగిందని అక్కడ ఉత్కంఠ వాతావరణాన్ని చూస్తున్న వారంతా భావిస్తున్నారు. చివరకు మాక్‌డ్రిల్ అని తెలిశాక ఊపిరిపీల్చుకున్నారు. రేణిగుంట: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమంలో పెనుముప్పు సంభవించిన యుద్ధ వాతావరణం మంగళవారం కనిపించింది. కేంద్ర భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు ప్రాంగణా న్నంతా చుట్టుముట్టి విమానాశ్రయంలోకి వెళ్లే ప్రయాణికులను, సిబ్బందిని బయటకు పంపేశారు. దీంతో ప్రయాణికులు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. విమానాశ్రయంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టులో ఏదో విపత్తు నెలకొం దని సగటు ప్రయాణికులు భావించారు. అదంతా ఎయిర్‌పోర్టులో అప్పుడప్పుడూ జరిగే మాక్ డ్రిల్‌లో భాగమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనీష్‌కుమార్ నేతృత్వంలో మంగళవారం ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులను ఉగ్రవాదుల చెర నుంచి, విపత్తుల నుంచి రక్షించే విధానాన్ని సిబ్బందికి అవగాహన నిమిత్తం ముందస్తుగా పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందితో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. విమానాశ్రయ ఉన్నతాధికారులకు అసలు విషయం తెలిసినా కిందిస్థాయి సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ తెలియకుండా గోప్యత పాటించారు. దీంతో సుమారు గంటకు పైగా ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్ నెలకొంది. -
ఉగ్రవాదులు చొరబడుతున్నారు!
అచ్యుతాపురం: సముద్రమార్గంలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడంపై మాక్‌డ్రిల్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు మెరైన్, కోస్టుగార్డు సిబ్బంది ఉగ్రవాదుల మాదిరిగా సముద్రమార్గంలో ప్రయాణించి భూభాగంలోకి ప్రవేశిస్తారు. వారిని తీరప్రాంత పోలీసులు గస్తీ నిర్వహించి పట్టుకోవాలి. చొరబాటును అడ్డుకోకుంటే సదరు ఉగ్రవాదులు సంబంధిత సిబ్బంది దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చేరుకుంటారు. ఇలా చొరబాటును అడ్డుకోవడంపై మూడురోజుల మాక్‌డ్రిల్‌ను చేపడుతున్నారు. దీంతో పోలీసులు తీరం నుంచి వచ్చే ప్రతివాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. పూడిమడక, తంతడి వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోలేకపోతే వారి విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉన్నతాధికారులు సమీక్షించి హెచ్చరిస్తారు. అయితే ఈ తతంగమంతా మాక్‌డ్రిల్ అని తెలియక మత్స్యకారులు పోలీసుల తనిఖీలతో భయపడుతున్నారు. తమ గ్రామం నుంచి ఎన్నిసార్లు బయటకు వెళ్లినా పోలీసులకు వివరాలను చెప్పాల్సి వస్తోంది. -
గ్యాస్ లీకేజీ ప్రమాదాలపై మాక్‌డ్రిల్
బాలాజీచెరువు (కాకినాడ): నిత్యం ప్రశాంతంగా ఉండే జేఎ¯ŒSటీయూకే బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీక్‌తో పాటు దట్టమైన పొగలు, మంటల వ్యాపించడం, వాటిని అదుపు చేయడానికి ఫైరింజన్లతో పాటు అంబులె¯Œ్సలు, వాటి నివారణకు ఏవిధంగా అప్రమత్తమవ్వాలి వంటి విషయాలపై నిర్వహించిన మాక్‌డ్రిల్‌తో హడావుడి వాతావరణం ఏర్పడింది. జాతీయ భద్రతా 46వ వారోత్సవాల్లో భాగంగా విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌కు జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ టౌ¯ŒSహాలు వద్ద ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ జేఎ¯ŒSటీయూకే వరకూ కొనసాగింది. జేఎన్టీయూకేలో మాక్‌డ్రిల్ నిర్వహించి ప్రమాదాలను ఏవిధంగా నివారించాలో వివరించారు.