పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి | Police martyrs services | Sakshi
Sakshi News home page

పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి

Published Sun, Oct 20 2013 2:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Police martyrs services

కోరుకొండ, న్యూస్‌లైన్ : శాంతి భద్రతల కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు ఆమరవీరుల సేవలు మరువలేనివని కోరుకొండ ఉత్తర మండలం డీఎస్పీ జి.మురళీకృష్ణ అన్నారు. కోరుకొండలో పోలీసుస్టేషన్‌లో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ముందు గా స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యం నుంచి ర్యాలీ జరిగింది. కోరుకొం డ, గోకవరం, సీతానగరం మండలాలు నుంచి విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళా మందిర్‌లో సీఐ వైవీ రమణ అధ్యక్షతన సభ జరిగింది. పోలీసు అమరవీరుల చిత్ర పటానికి డీఎస్పీ జి.మురళీకృష్ణ పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
 
 అనంతరం జరిగిన సభలో డీఎస్పీ మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి ఆధ్వర్యంలో మూడు మండలాల్లో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించామన్నారు. శాంతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు. సీఐ వైవీ రమణ, కోరుకొండ తహశీల్దార్ కె.పోసయ్య, గోకవరం ఎంపీడీఓ నాతి బుజ్జి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ చింతపల్లి చంద్రం, కోరుకొండ గ్రామ సర్పంచ్ కటకం అన్నపూర్ణచలం, మాజీ సర్పంచ్ వాకా నరసింహరావు, పంచాయతీ వార్డు సభ్యులు పరస శ్రీను. మైరెడ్డి రాంబాబు, కర్రి గణేష్, కోరుకొండ, గోకవరం, సీతానగరం ఎస్సైలు బి. వెంకటేశ్వరరావు, జీవీ నాగేశ్వరరావు, సీహెచ్ రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, అధ్యాకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement