గుంటూరు : గుంటూరులో పోలీసులు శనివారం ఓవరాక్షన్ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై లాఠీలు ఝళిపించారు. రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను తరిమికొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు.. తర్వాత శంకర్ విలాస్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అయితే పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలను బలవంతంగా లాక్కెళ్లారు. పార్టీ నేత షౌకత్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసుల దౌర్జన్యంపై ఉద్యమకారులు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసుల ఓవరాక్షన్
Published Sat, Dec 7 2013 2:01 PM | Last Updated on Tue, Aug 21 2018 8:00 PM
Advertisement
Advertisement