సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ రైతుల జీవితాల్లోకర్ణాటక ప్రభుత్వం చీకట్లు నింపుతోంది. తెలంగాణ ప్రాంత నేతల సహకారంతో జలచౌర్యానికి‘ఎత్తు’గడ వేసింది. రాజోలిబండ డైవర్షన్‌స్కీం(ఆర్‌డీఎస్) వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోంది. పది రోజులుగా రైతుల్లోకలకలం రేపుతున్న ఆర్డీఎస్ ఆధునికీకరణపనులు రోజుకో మలుపు తిరుగుతుండటంఆందోళన కలిగిస్తోంది.
ఆర్డీఎస్ ఎత్తు పెంపునకుపోలీసు బందోబస్తు కావాలని జిల్లా అధికారులకు ఆ ప్రభుత్వం లేఖ రాయడంతో సరిహద్దులోఎప్పుడు ఏమి జరుగుతుందోననే టెన్షన్‌నెలకొంది. జిల్లా రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఒక అడుగు వెనక్కు వేసిన కర్ణాటక..ఆదివారం నుంచి పనులు పునఃప్రారంభిస్తామనిప్రకటించడం మరోసారి ఉద్రిక్తతకు కారణమైంది. మంత్రాలయం నియోజకవర్గంలోనిరైతులు పెద్ద ఎత్తున ఆర్డీఎస్ వద్దకు చేరుకోవడంతో కర్ణాటక అధికారులు పనులను మరోసారివాయిదా వేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక..తమిళనాడు రాష్ట్రాల మధ్య నిర్మితమైన ఈప్రాజెక్టు తరచూ వివాదాలకు కారణమవుతోంది.ఆధునికీకరణ పేరిట ఆనకట్టు ఎత్తు పెంచేందుకుఇటీవల కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులుచేపట్టిన పనులను మంత్రాలయం నియోజకవర్గవైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రైతులుఅడ్డుకున్నారు.
కర్ణాటక నిర్ణయంతో సీమ ప్రాంతఆయకట్టు రైతులకు మిగిలేది కన్నీళ్లేననే వాదనను బలంగా వినిపించారు. వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడం..అధికార పార్టీ నేతలు నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు అక్కడి రైతాంగంపై ఉన్న శ్రద్ధ ఆంధ్రలో లేకపోవడం పట్ల అన్నదాత గుర్రుమంటున్నారు.ఆర్డీఎస్ ఎత్తు పెంచితే శ్రీశైలం డ్యాంకు నీరందకపోవడంతో పాటు కేసీ ఆయకట్టు రైతులభవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది.
కర్ణాటక నిర్ణయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఒకే అక్కడుగాఅడ్డుకుంటున్నా.. అధికార పార్టీ నోరు మెదపకపోవడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక నీటిపారుదల శాఖమంత్రిపై ఎత్తు పెంపు పనులు కొనసాగించేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణయాజమాన్య బోర్డును మార్పు చేసేలోగా ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకుకుట్ర జరుగుతోంది. ఇందుకు ప్రతిగా ఆర్డీఎస్‌ఎగువ భాగంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నఆనకట్టలకు తాము అభ్యంతరం చెప్పబోమనితెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చర్చజరుగుతోంది. మొదటి నుంచి ఉమ్మడి ప్రాజెక్టులవిషయంలో కర్ణాటక పెత్తనం చెలాయిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్డీఎస్ విషయంలో మరోసారి జిల్లారైతాంగానికి అన్యాయం జరగక మునుపే నేతలుమేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టెన్షన్.. టెన్షన్
Published Mon, Jul 21 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement