Rajolibanda Diversion Scheme
-
కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రితో హరీష్ భేటీ
బెంగళూరు : పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆర్టీఎస్ పనులు ఈ సీజన్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు బృందానికి కర్ణాటక మంత్రి ఎం బి పాటిల్ హామీ ఇచ్చింది. గురువారం బెంగుళూరులో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం బి పాటిల్‌తో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బృందం భేటీ అయ్యి... ఈ రాజోలి బండ మళ్లింపు పథకం అంశంపై చర్చించింది. -
టెన్షన్.. టెన్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ రైతుల జీవితాల్లోకర్ణాటక ప్రభుత్వం చీకట్లు నింపుతోంది. తెలంగాణ ప్రాంత నేతల సహకారంతో జలచౌర్యానికి‘ఎత్తు’గడ వేసింది. రాజోలిబండ డైవర్షన్‌స్కీం(ఆర్డీఎస్) వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోంది. పది రోజులుగా రైతుల్లోకలకలం రేపుతున్న ఆర్డీఎస్ ఆధునికీకరణపనులు రోజుకో మలుపు తిరుగుతుండటంఆందోళన కలిగిస్తోంది. ఆర్డీఎస్ ఎత్తు పెంపునకుపోలీసు బందోబస్తు కావాలని జిల్లా అధికారులకు ఆ ప్రభుత్వం లేఖ రాయడంతో సరిహద్దులోఎప్పుడు ఏమి జరుగుతుందోననే టెన్షన్నెలకొంది. జిల్లా రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఒక అడుగు వెనక్కు వేసిన కర్ణాటక..ఆదివారం నుంచి పనులు పునఃప్రారంభిస్తామనిప్రకటించడం మరోసారి ఉద్రిక్తతకు కారణమైంది. మంత్రాలయం నియోజకవర్గంలోనిరైతులు పెద్ద ఎత్తున ఆర్డీఎస్ వద్దకు చేరుకోవడంతో కర్ణాటక అధికారులు పనులను మరోసారివాయిదా వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక..తమిళనాడు రాష్ట్రాల మధ్య నిర్మితమైన ఈప్రాజెక్టు తరచూ వివాదాలకు కారణమవుతోంది.ఆధునికీకరణ పేరిట ఆనకట్టు ఎత్తు పెంచేందుకుఇటీవల కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులుచేపట్టిన పనులను మంత్రాలయం నియోజకవర్గవైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రైతులుఅడ్డుకున్నారు. కర్ణాటక నిర్ణయంతో సీమ ప్రాంతఆయకట్టు రైతులకు మిగిలేది కన్నీళ్లేననే వాదనను బలంగా వినిపించారు. వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడం..అధికార పార్టీ నేతలు నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు అక్కడి రైతాంగంపై ఉన్న శ్రద్ధ ఆంధ్రలో లేకపోవడం పట్ల అన్నదాత గుర్రుమంటున్నారు.ఆర్డీఎస్ ఎత్తు పెంచితే శ్రీశైలం డ్యాంకు నీరందకపోవడంతో పాటు కేసీ ఆయకట్టు రైతులభవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. కర్ణాటక నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఒకే అక్కడుగాఅడ్డుకుంటున్నా.. అధికార పార్టీ నోరు మెదపకపోవడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక నీటిపారుదల శాఖమంత్రిపై ఎత్తు పెంపు పనులు కొనసాగించేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పర్యవేక్షణయాజమాన్య బోర్డును మార్పు చేసేలోగా ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకుకుట్ర జరుగుతోంది. ఇందుకు ప్రతిగా ఆర్డీఎస్ఎగువ భాగంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నఆనకట్టలకు తాము అభ్యంతరం చెప్పబోమనితెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చర్చజరుగుతోంది. మొదటి నుంచి ఉమ్మడి ప్రాజెక్టులవిషయంలో కర్ణాటక పెత్తనం చెలాయిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్డీఎస్ విషయంలో మరోసారి జిల్లారైతాంగానికి అన్యాయం జరగక మునుపే నేతలుమేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మూడు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ
కర్నూలు(రూరల్): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆధునికీకరణ పనుల సాకుతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు యత్నించడం వివాదానికి కారణమైంది. ఈ వివాదం ముగియక మునుపే మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకి నీరందడం లేదని, ఆనకట్ట ఎత్తు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకుపోయింది. దిగువకు నష్టం వచ్చేంత స్థాయిలో ఎత్తు పెంచడం లేదని, మహబూబ్‌నగర్ రైతులను అదుకునేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఇటీవల తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానం ఇవ్వాలని మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఆర్డీయస్ ఆనకట్ట ఎత్తు పెంచితే సీమ ప్రాంత ఆయకట్టు రైతులకు మిగిలేది కన్నీళ్లేనని, హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేయకూడదని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం మూడు రాష్ట్రాలకు చేరింది. హరీష్‌రావు లేఖలోని అంశాలు ఇవి.. ఆర్డీఎస్ ఆనకట్ట మధ్యలో అక్కడక్కడ స్తంభాలు ఏర్పాటు చేసుకొని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకుంటాం. హెడ్ రెగ్యులేటర్‌కు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి పవర్ క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు అనుమతివ్వాలి. బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేస్తాం. ఆనకట్ట కింద ఉన్న పైపులను తీసేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేస్తాం. {పస్తుతం దిగువకు నీరు వస్తున్న స్లూయిజ్‌ను మూసి వేస్తాం. ఆనకట్టను అడుగు ఎత్తు పెంచుకొని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం. అధికారుల నివేదిక ఇదీ.. కర్నూలు జిల్లాలో 4 గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 15 గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఆర్డీఎస్ను నిర్మించారు. 42.60 కి.మీ నుంచి 143 కి.మీ వరకు ఆర్డీఎస్ కాల్వ ఏపీ పరిధిలోకి వచ్చింది. మిగిలిన 0 కి.మీ నుంచి 42.60 కి.మీ వరకు రాయచూరు జిల్లాలోకి వెళ్లింది. 42 కి.మీ వరకు 5,879 ఎకరాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆర్డీఎస్ ఆయకట్టు దిగువకు పోయే నీటిపైనే కేసీ ఆయకట్టు ఆధారపడి ఉంది. ఆనకట్ట మద్యలో స్తంభాలు, హెడ్ రెగ్యులేటర్ గేట్లను, బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లు ఏర్పాటుతో దిగువకు చుక్క నీరందదు. ఆధునికీకరణ సాకుతో ఎత్తు పెంచేందుకు తెలంగాణ పాలకులు, అధికారులు కుట్ర చేస్తున్నారు. ఇప్పటీకే ఆనకట్టకు ఉన్న 19 పైపులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఒక వెంట్ ద్వారానే దిగువకు నీరు వస్తోంది. దీన్ని కూడా మూసి వేస్తే నీరంతా హెడ్ వర్క్స్ వైపు పోతుంది. నీటి నిల్వ పెంచితే కేసీ ఆయకట్టుకు సాగు నీరు అందక 2.65 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా పనులు చేయడం చట్ట విరుద్ధం. -
రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు. అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు. కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.