
హిమబిందు' కేసులో పోలీసులపై వేటు
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. పడమట పీఎస్ సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు వారిపై విజయవాడ నగర కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చి నెలలో యనమలకుదురులో హిమబిందు హత్యకు గురైంది. మార్చి 15న ఆమె నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. హిమబిందుపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరీ పోలీసులు అరెస్ట్ చేశారు.