Himabindu murder case
-
హిమబిందు హత్యకేసు కొట్టివేత
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్యకేసును మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. గతేడాది మార్చి 17న హిందుబిందు మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాల్వలో తేలింది. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని ఎలక్ట్రిషియన్ జనపాల కృష్ణ(24), పలువూరి దుర్గారావు అలియాస్ కయ్యా(21), లంకపల్లి రమణ(22), మహ్మద్ సుభాని(27) , దుర్గాప్రసాద్, సోమన గోపీకృష్ణ(24) లను పోలీసులు అరెస్ట్ చేసి, అభియోగాలు మోపారు. -
'హిమబిందు' కేసులో పోలీసులపై వేటు
-
హిమబిందు' కేసులో పోలీసులపై వేటు
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. పడమట పీఎస్ సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు వారిపై విజయవాడ నగర కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో యనమలకుదురులో హిమబిందు హత్యకు గురైంది. మార్చి 15న ఆమె నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. హిమబిందుపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
మీడియా ముందుకు ' హిమబిందు' నిందితులు
విజయవాడ : విజయవాడలో సంచలనం రేకెత్తించిన బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య కేసులో నిందితులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి మృతురాలి నగలను స్వాధీనం చేసుకున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు, తల్లి వయసున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆనక ఆమెపైనే పుకార్లు సృష్టించారని పోలీసులు తెలిపారు. అటు మృతురాలి బంధువులను, ఇటు తమను అందరినీ తప్పుదోవ పట్టించారని పోలీసులు వెల్లడించారు. నిందితులకు తగిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
హిమబిందు హత్యకేసులో నిజాల నిర్ధారణ
విజయవాడ: కృష్ణా జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్యకేసులో నిజాలను పోలీసులు నిర్ధారించారు. కారు డ్రైవర్ సుభానితోపాటు అతనికి సహకరించిన స్నేహితుడు గోపికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మరో నలుగురి సహాయంతో హిమబిందుపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు నిందితులు వెల్లడించారు. అత్యాచారం చేసిన తరువాత, డ్రైవర్ సుభానీని గుర్తిస్తుందని వారు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తరువాత ఆమె నుంచి బంగారాన్ని తీసుకున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు, 3 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కుట్ర, డెకాయిట్, నిర్భయ కేసులు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిమ్ కార్డు ద్వారా నిందితుడిని గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుభాని ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావించారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అప్పుడే వారు అనుమానించారు.