
మీడియా ముందుకు ' హిమబిందు' నిందితులు
విజయవాడ : విజయవాడలో సంచలనం రేకెత్తించిన బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య కేసులో నిందితులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి మృతురాలి నగలను స్వాధీనం చేసుకున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు, తల్లి వయసున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆనక ఆమెపైనే పుకార్లు సృష్టించారని పోలీసులు తెలిపారు. అటు మృతురాలి బంధువులను, ఇటు తమను అందరినీ తప్పుదోవ పట్టించారని పోలీసులు వెల్లడించారు. నిందితులకు తగిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు.