
హిమబిందు హత్యకేసు కొట్టివేత
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్యకేసును మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.
గతేడాది మార్చి 17న హిందుబిందు మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాల్వలో తేలింది. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని ఎలక్ట్రిషియన్ జనపాల కృష్ణ(24), పలువూరి దుర్గారావు అలియాస్ కయ్యా(21), లంకపల్లి రమణ(22), మహ్మద్ సుభాని(27) , దుర్గాప్రసాద్, సోమన గోపీకృష్ణ(24) లను పోలీసులు అరెస్ట్ చేసి, అభియోగాలు మోపారు.