సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కలిసి చర్యలు
ఏజెన్సీ పోలీస్‌స్టేషన్లకు పటిష్టమైన భద్రత
విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్
రంపచోడవరం :జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. సోమవారం రంపచోడవరం వచ్చిన ఆయన రంపచోడవరం ఏఎస్పీ డాక్టర్ కె.ఫకీరప్పతో కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిందన్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలో 11 దళాలు వరకు సంచరిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టుల సంచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విశాఖ జిల్లా పోలీస్ అధికారులతో సంప్రదిస్తూ మావోరుుస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులో 30 కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు అనేక సంఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏజెన్సీ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్‌లకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా తెలంగాణ కమిటీ ఏర్పాటు ద్వారా తూర్పులో మావోరుుస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడేందుకు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. చింతూరు ప్రాంతంలో మావోరుుస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందన్నారు. ఇటీవల విశాఖ జిల్లా గుమ్మిరేవులలో పోలీసులకు, మావోరుుస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదన్నారు. మావోయిస్టులకు సహకరించవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఉపాధి అవకాశాలతో యువత తీవ్రవాదానికి దూరం..
గిరిజన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మావోరుుస్టుల కార్యకలాపాలకు దూరంగా ఉంటారని ఎస్పీ అన్నారు. గిరిజన యువతను మావోయిస్టులకు దూరం చేయడం ద్వారా వారికి గిరిజనుల నుంచి ఎటువంటి సహకారం లేకుండా చేయవచ్చన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగానికి సంబంధించి గిరిజన యువతకు ఎత్తులో సడలించినట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్‌లో రూ. 50 కోట్లతో ఏజెన్సీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. దీనిలో భాగంగా వై.రామవరం-గుర్తేడు రోడ్డు, గుర్తేడు-పాతకోట-మంగంపాడు రోడ్లను పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీలో ఎటువంటి అసాంఘిక శక్తుల ఆగడాలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. గంజాయి, రంగురాళ్ల వ్యాపారులకు పోలీసుల సహకారం ఉన్నా, ఆ కార్యకలాపాల్లో వారి పాత్ర ఉన్నా కఠినచర్యలు తప్పవని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు.
మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కుపాదం
Published Tue, Apr 21 2015 3:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement