విశాఖ మన్యంలో భీకరంగా కాల్పులు | firing between maoists, police in vishaka agency | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో భీకరంగా కాల్పులు

Published Fri, Sep 4 2015 10:20 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

firing between maoists, police in vishaka agency

జీకే వీధి: విశాఖ ఏజెన్సీ పరిధిలో శుక్రవారం రాత్రి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. జీకే వీధి మండలం నడుంవీధి అటవీ ప్రాంతంలో రాత్రి 7 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య అరగంట సేపు హోరా హోరీ కాల్పులు జరిగాయి. అయితే, ఇరు వైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. తమ బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధ్రువీకరించారు.

మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement