ఎక్కుపెట్టండిలా..!
పోలీసులు, వెపన్లు అంటే ఆమడదూరంలో ఉండే విద్యార్థులు ఆయుధాల ప్రదర్శనపై ఆసక్తి కనబర్చారు. పోలీసులు ఉపయోగించే వస్తువులు, ఆయుధాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో పోలీసులు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యాధునిక ఆయుధాలు 303, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), కార్బన్, ఏకే 47, ఇన్‌సాస్, డీబీబీఎల్ (రబ్బర్ బుల్లెట్ ) గ్యాస్ గన్, రివాల్వర్, పిస్టల్, గ్రెనేడ్, బాంబ్‌లను ప్రదర్శించారు.
వాటిని ఆసక్తిగా తిలకించిన హైస్కూల్ విద్యార్థులు అవి ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థినులు ఆయుధాలను చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడ్డారు. ఆయుధాలు, వైర్‌లెస్ సెట్ పనితీరు, ప్రయోజనాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. సీఐ జి.దేవకుమార్, ఆర్‌ఐ పీఎం రాజు, ఎస్సైలు ఎస్‌సీహెచ్ కొండలరావు, వి.శ్రీనివాసరావు, కమ్యూనికేషన్ ఎస్సై కె.గవిర్రెడ్డి, జెడ్పీ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం సుబ్బారావు, ఏలూరు ఏఆర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
- తాడేపల్లిగూడెం