ఖమ్మం జిల్లాలో 40 మంది అదుపులోకి..
చర్ల(ఖమ్మం), న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఖమ్మం జిల్లాలో రెండు ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆడా మగా తేడా లేకుండా 40 మందికిపైగా ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు. చర్ల మండలంలోని ఎర్రంపాడు, చెన్నాపురం గ్రామాలకు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకుని ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి తుపాకులతో భయపెట్టారు. తమ వెంట రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమను చూసి పారిపోయేందుకు యత్నించిన పలువురిని పట్టుకుని పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది.
ఎర్రంపాడుకు చెందిన తొమ్మిది మందిని, చెన్నాపురానికి చెందిన 35 మందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిలో 10-15 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ఎర్రంపాడుకు చెందిన ముగ్గురిని గీసరెల్లి వద్ద వదిలేశారని స్థానికులు చెప్పారు. మరికొందరిని చర్ల పోలీస్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని చర్ల ఎస్సై దోమల రమేశ్ చెప్పారు.
ఆదివాసీలపై పోలీసుల దాష్టీకం
Published Mon, Jan 20 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement