మేం బతికే ఉన్నాం
పింఛన్ల పరిశీలన దగ్గర నుంచి తాత్కాలిక ఉద్యోగాల భర్తీ వరకూ అన్నింటిలోనూ రాజకీయ జోక్యం మితిమీరింది. కావలసిన వారికి ప్రయోజనం కల్పించేందుకు... పేదల నోటికాడ కూడు లాగేస్తున్నారు. నిరుద్యోగుల ఆశలను చిదిమేస్తున్నారు.... ముదిమి మీదపడినా వయస్సు చాలదని కొందరికి, బతికున్న వారిని ఏకంగా మృతుల జాబితాలో చేర్చేసి మరికొందరికి పింఛన్లు నిలిపివేశారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. వీటిని భరించలేకపోతున్న బాధితులు తమకు న్యాయం చేయమంటూ వేడుకొంటున్నారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదు దారులతో పోటెత్తింది. పింఛన్లు తొలగించారని, అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకుని తమకు అన్యాయం చేశారని వాపోతూ పలువురు ఫిర్యాదు చేశారు.
విజయనగరం కంటోన్మెంట్: ఈ ఫొటోలోని వృద్ధుడి పేరు మాకవరపు రామలింగం. తెర్లాం మండలం జగన్నాథవలసకు చెందిన ఇతని వయసు 75 సంవత్సరాలకు పైనే ఉంటుంది. కానీ రేషన్ కార్డులో ఇతనికి 45. ఇతని భార్య గౌరికి 60 ఏళ్లు అని ఉండడంతో నీకింకా పింఛను ఇచ్చే వయసు రాలేదని నిలిపేశారు. అసలే కటిక పేదయిన రామలింగానికి నెలకు వచ్చే రెండు వందల రూపాయలే ఆధారం. ఎటూ కదల్లేని ఈ పండుటాకు వచ్చే నెల నుంచి పింఛను వెయ్యి రూపాయలకు పెంచుతారనేసరికి ఎంతో ఆనందపడ్డా ఇప్పుడు ఉన్న రెండొందలు కూడా ఇవ్వరనే సరికి ఏం చేయాలో తెలియక కలెక్టరేట్‌కు మరొకరి సాయంతో వచ్చి చేతులు జోడించి వేడుకున్నాడు.
ఈమె గరివిడి మండలం ఏనుగు వలసకు చెందిన బూటు లక్ష్మి. ఈమెకు పూర్తిగా ఓ కన్ను కని పించదు. ఫొటో చూస్తే ఈ విషయం అందరికీ తె లుస్తుంది. కానీ అధికారులకు మాత్రం ఈమెకు వైకల్యం కనిపించలేదు. ఈమెకు ఇచ్చిన వికలాంగ ధ్రువీకరణ పత్రంలో 55 శాతం వైకల్యం ఉన్నప్పటికీ ఈమెకు పింఛను నిలిపివేశారు. దీంతో ఈమె కూడా కలెక్టరుకు మొరపెట్టుకునేందుకు వచ్చింది.
బాగు వలస కు చెందిన వీరిద్దరిపేర్లు బాలి అన్నపూర్ణ, పాండ్రంకి లచ్చమ్మ. వీరిద్దరి భర్తలు మృతి చెంది దాదాపు 25 సంవత్సరాలవుతోంది. అయితే భర్తలు చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రం తెమ్మనడమే కాకుండా, తామే చనిపోయినట్టు పేర్కొంటూ పింఛన్ జాబితా నుంచి పేర్లను తొలిగించారని, మా స్థానంలో టీడీపీనేతల బంధువుల పేర్లను కొత్తగా నమోదు చేశారని వీరు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రానికి వెళితే మీరు చనిపోయినట్టు మాకు సమాచారం ఉందని అధికారులు చెప్పడంతో నోరెళ్లబెట్టడం వీరి వంతయింది.
ఈమె రెడ్డి పాపమ్మ. గ్రా మం కందిపేట. భర్త క న్నంనాయుడు మృతి చెంది పది సంవత్సరా లు పైనే అయింది. భర్త మృతి చెందినట్టు ఈమె కు ఇప్పుడు సర్టిఫికేట్ ఎ వరిస్తారు? కానీ అధికారులు అడిగారు. అదెక్కడిస్తారో తెలియని ఈ వి తంతువు కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకుంది.
ఇలా జిల్లాలోని 34 మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.జిల్లా వ్యాప్తంగా 2.74 లక్షల మంది ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రేషన్ కార్డుల్లో వయసు తప్పు పడినా, వితంతువుల వద్ద భర్త మరణ ధ్రువీకరణ ప త్రం లేకపోయినా పింఛను ఆపేస్తున్నారు. దీం తో వృద్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతీ నెలా వచ్చే రెండు వందల రూపాయలు తమకుఎంతగానో ఆసరాగా ఉండేదనీ, సొమ్ము పెంచుతామని చెప్పి ఉన్నవి తీసేస్తే తామెలా బతాకాలని వారు వాపోతున్నారు. జిల్లాలో గా పింఛను దారుల పరిశీలనా కార్యక్రమాన్ని చేపట్టిన అధికార యంత్రాంగం తెలుగు దేశం నేత లు చెప్పిన వారికే పింఛన్లు రాశారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.70 ఏళ్లు పైబడిన వారికి కూడా రేషన్ కార్డు ప్రకారం నీకు వయసు చాలలేదని చెప్పడంతో వారంతా అవాక్కవుతున్నారు. ఇదేం ఖర్మరా బాబూ! ఈ వయసులో నేను పింఛను కోసం మళ్లీ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తేవాలని కాళ్లీడ్చుకుంటూ వస్తున్నారు. తమకు పింఛను కల్పించాలని, పెంచకపోయినా పర్వాలేదు. ఉన్న పింఛను తీసెయ్యొద్దని వేడుకుంటున్నారు.