సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతం
Published Thu, Oct 31 2013 1:59 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతస్థాయికి తీసుకెళ్లాలని రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ ఒకటో తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, పార్లమెంటు సీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ జరిగే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాజకీయ జేఏసీ వేదికపై బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎండీ నసీర్ అహ్మద్, ఆతుకూరి ఆంజనేయులు, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎండీ హిదాయత్, కనపర్తి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్. శ్యామ్యూల్, విద్యార్థి జేఏసీ కో-ఆర్డినేటర్ వెంకటరమణ తదితరులు చరించి పలు తీర్మానాలు చేశారు. రాజకీయ జేఏసీ దీక్షా శిబిరాన్ని డిసెంబర్ 15వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు.
Advertisement