'తెలంగాణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు'
Published Sat, Aug 17 2013 6:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
తెలంగాణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకంగా కాదని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటించి ఉంటే రాష్ట్ర విభజన అంశం వివాదాస్పదమై ఉండేది కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మండలంలోని అన్నపురెడ్డిపల్లిలో శుక్రవారం ఆయన అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు పన్ని ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే పట్టం కట్టారని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే వైఎస్సార్‌సీపీ ఈ ప్రాంతంలో ఉండదని కాంగ్రెస్, టీడీపీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాబోయే ప్రతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొలుత ఆయన గ్రామంలోని బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసరి వెంకటేశ్వరరెడ్డి, కీసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ఇంజం గోపాలరావు, సర్పంచ్‌లు దారావత్ కృష్ణకుమారి, ఇస్లావత్ రుక్మిణి. వనమా గాంధీ, పర్సా వెంకట్, భీంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం లక్ష్మణరావు, బూర్గుపల్లి కృష్ణారావు, చల్లా పుల్లయ్య, వడ్డే సత్యం, ఐలూరి సైదిరెడ్డి, సంకా కృపాకర్, వి వెంకటనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement