
జైరాం రమేశ్ వ్యాఖ్యలను ఖండించిన పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్పై కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. రాజకీయాల్లో మాటలు విలువలకు తగ్గట్టుగా ఉండాలని సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అదే విధంగా కేసీఆర్ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అన్నారు.
టీఆర్‌ఎస్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సంకుచిత పార్టీగా జైరాం రమేశ్ నిన్న వర్ణించారు. అలాంటి పార్టీకి అండగా ఎలా ఉంటారని తెలంగాణ జేఏసీ నేతలను ప్రశ్నించారు.