శంకుస్థాపన వాయిదా | Postponed rapprochement | Sakshi
Sakshi News home page

శంకుస్థాపన వాయిదా

Published Sat, Feb 15 2014 2:50 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Postponed rapprochement

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లో ఈనెల 16న తలపెట్టిన ఐటీ ఇన్‌క్యుబేషన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదాపడింది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపై గందరగోళం నేపథ్యంలో అధికార పార్టీ నేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. పెప్పర్ స్ప్రే ఘటనలో అస్వస్థతకు గురవటంతో షెడ్యూలు ప్రకారం శని, ఆదివారాల్లో జిల్లాకు రావాల్సిన ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
 
 ముందుగా ఖరారైన షెడ్యూలు ప్రకారం 16న ఉదయం ఇన్‌చార్జి మంత్రి సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్ సమీపంలోని 10 ఎ కరాల స్థలంలో ఐటీపార్కు, శాతవాహన యూ నివర్సిటీలో భవన నిర్మాణాలు, వెటర్నరీ పాలి టెక్నిక్ కాంప్లెక్స్‌కు భూమిపూజ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంది. అదేరోజు మ ధ్యాహ్నం దేవంపల్లిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూ ల్, శంకరపట్నంలో సీపీడబ్ల్యూఎస్‌కు భూమిపూజ, భీమదేవరపల్లి, కమలాపూర్‌లో కేజీవీబీ ప్రారంభోత్సవాలు, హుజూరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చే యాల్సి ఉంది. మంత్రి పర్యటన రద్దవడంతో ఈ కార్యక్రమాలన్నీ వాయిదాపడ్డాయి. 21న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే లోపు ఈ పనులకు మళ్లీ ముహూర్తం ఖరారు చేసే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement