సమన్వయం శ్రీధర్ చేతికి.. | Sridhar hand co-ordination .. | Sakshi
Sakshi News home page

సమన్వయం శ్రీధర్ చేతికి..

Published Sat, Jan 4 2014 2:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Sridhar hand co-ordination ..

మంత్రి పదవికి రాజీనామా చేసిన డి.శ్రీధర్‌బాబుకు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల నుంచి అనూహ్యమైన సంఘీభావం లభించింది. మొన్నటిదాకా ప్రభుత్వపరంగా సభా వ్యవహారాలను నిర్వహించిన శ్రీధర్‌బాబుకే సభలో తెలంగాణ శాసనసభ్యులను ఏకతాటిపై నడిపించే బాధ్యతలను అప్పగించారు.
 
 సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరుగనున్న సమయంలో సభావ్యవహారాల శాఖ నుంచి తప్పిండంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీధర్‌బాబు.. మంత్రివర్గ సహచరులు, పార్టీ పెద్దలు నచ్చజెప్పినా వినకుండా పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత సభావ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇది రుచించని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖకు కత్తెర పెట్టడం తెలంగాణవాదులందరి ఆగ్రహానికి కారణమైంది. ఈ పరి ణామాలతో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులందరు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు.

సభలో తెలంగాణకు అనుకూలంగా కలిసికట్టుగా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రభుత్వపరంగా సభా వ్యవహారాలను నిర్వహించిన శ్రీధర్‌బాబుకే సభలో తెలంగాణ శాసనసభ్యులను ఏకతాటిపై నడిపించే బాధ్యతలను అప్పగించారు. అనధికారికంగా ఇప్పుడు ఆయన సభలో అవే బాధ్యతలను నిర్వర్తిస్తారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు.

జనవరి 23 నాటికి తెలంగాణ బిల్లుపై చర్చ ముగించాల్సి ఉంది. రాష్ట్రపతిని మరింత గడువు కోరాలని యోచిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బిల్లుపై సభలో చర్చ జరగకుండా ప్రయత్నిస్తారని తెలంగాణ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈప్రాంత ఎమ్మెల్యేలు సభలో సమర్థంగా వ్యవహరించేందుకు పార్టీకి ఇద్దరు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పా టు చేశారు. తెలంగాణపై చర్చ జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే శాఖను మార్చినట్టు శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. తన శాఖ మా ర్చడం కేవలం తన ఒక్కడి గౌరవానికి సంబంధించినది కాదని, యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా భావించే తన పదవిని వదులుకున్నట్టు చెప్పా రు.
 
 నిజంగానే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణ యం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని భావించి శుక్రవారం జరిగిన సమావేశంలో శ్రీధర్‌బాబును సభావ్యవహారాల శాఖనుంచి తప్పించడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అన్ని పార్టీల శాసనసభ్యులతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలవాలని తీర్మానించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో శ్రీధర్‌బాబు వ్యవహరించిన తీరుపై అన్ని పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కరీంనగర్ జిల్లాలోనే తెలంగాణవాదులపై కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్న విమర్శలున్నాయి.
 
 ఉద్యమంలో ప్రతి కీలకదశలో ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడిన వారిని టార్గెట్ చేశారని విరుచుకుపడిన పార్టీలే మారిన పరిస్థితుల్లో ఆయనకు అండగా నిలబడడం విశేషం. రెండు రోజుల పరిణామాలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నా.. తెలంగాణ అంశం కీలకమలుపు ఉన్న నేపథ్యంలో అంతా ఒక్కటిగా ఉన్నారన్న సంకేతాలు ఇవ్వ డం అవసరమని భావించి శ్రీధర్‌బాబుకు బాసటగా నిలబడ్డట్టు ఇతర పార్టీల నేతలు చెప్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement