అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు | Potula suresh arrest case, Transfer of SI politically motivated | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు

Published Fri, Aug 1 2014 2:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు - Sakshi

అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు

అనంతపురం : అనంతపురం జిల్లాలో నిజాయితీపై వేటు పడింది. టీడీపీ నేత, ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అరెస్ట్ చేసిన ఎస్ఐ శ్రీరామ్ని బదిలీ  చేశారు. ఆయనను వీర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉంచారు. సెటిల్‌మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలతో పరిటాల ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ను అరెస్ట్ చేసినందుకు ఎస్ఐపై ఈ చర్య తీసుకోవటం గమనార్హం.  

కాగా గురువారం రాత్రి  ధర్మవరం శివనగర్ సమీపంలోనున్న బిన్ని మిల్స్‌లో పోతుల సురేష్ అనుచరులతో కలిసి ఉండగా అటువైపు వెళ్లిన ఎస్‌ఐ శ్రీరామ్.. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సురేష్ను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు రావటంతో .... పోతుల సురేష్ను వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement