నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: కరెంటు కోతలకు అధికారిక ముద్ర పడింది. వాస్తవానికి రబీ ప్రారంభంతోనే అనధికారికంగా కరెంటు కోతలు షురూ అయ్యాయి. గురువారం నుంచి అధికారికంగా కోతలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎం డీ కార్తికేయ మిశ్రా నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. నగ రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్లవారీగా వీటిని అమ లు చేస్తారు. గ్రామాలలో ఇక కష్టాలు తప్పేలా లేవు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ నగేష్‌కుమార్ బుధవారం వివరాలను పత్రికలకు విడుదల చేశారు.
నిజామాబాద్ నగరంతోపాటు, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలో నాలుగు గంటలు కోతలు విధించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా ఉండదు.
జిల్లాలోని 36 మండల కేంద్రాలలో ఆరు గంటల కోతలు ఉంటాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా నిలిపివేస్తారు. సబ్‌స్టేషన్ ఉన్న ప్రాంతాలలో ఎమిమిది గంటల కోతలు విధిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకుు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సరఫరా ఉండదు.
గ్రామాలలో ఏకంగా పన్నెండు గంటలు కోతలు విధిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరంతరాయంగా సరఫరా ఉండదు. కోతలు విధించనున్నారు.
కోతలు షురూ
Published Thu, Jan 16 2014 6:13 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement