మావోల డంప్‌పై విలేకరుల సమావేశం
తూర్పుగోదావరి (కాకినాడ) : పోలీసులను టార్గెట్ చేసేందుకే మావోలు పేలుడు పదార్ధాలను దాచిపెట్టి ఉంటారని తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నమావోస్టుల డంప్‌పై గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారంతో జిల్లాకు చెందిన రెండు ఏఎన్‌ఎస్ పార్టీలను రామవరం మండలంలోని గోర్లోడు, తిరుచారు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు దించిన సంగతి విదితమే.
ఈ కూంబింగ్‌లో భారీగా మావోల డంప్ బయట పడింది. డంప్‌లో 8 రాకెట్ లాంచర్‌లు, 5 సింగిల్ బ్యారల్ గన్‌లు, రెండు పిస్తోళ్లు, 15 కేజీల జిలిటిన్ స్టిక్స్, 5 ప్యాకెట్ల పొటాషియం నైట్రేట్, మూడు డబ్బాల అమ్మోనియంతో పాటు పేలుడు పదార్ధాలలో వినియోగించే పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న జరిగిన కూంబింగ్‌లో ఇవన్నీ దొరికాయి.