హైదరాబాద్: భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తాము పన్నులు చెల్లిస్తున్నామని ప్రైవేట్ బస్సుల యజమానులు తెలిపారు. ప్రైవేట్ బస్సు ట్రావెల్స్‌పై 50 వేల కుటుంబాలు ఆదారపిడి జీవిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంఘటనను పట్టుకుని ఇంతగా వేధింపులా? అని ప్రశ్నించారు. ఈ రకమైన వేధింపులు సరికాదన్నారు.
ఇన్నాళ్లు సక్రమం అనిపించిన వ్యాపారం, ఇప్పుడు తప్పుగా ఎలా అనిపిస్తుందని వారు అడిగారు. తాము అక్రమంగా బస్సును నడుపుతున్నట్లు నిరూపిస్తే తమ వ్యాపారం ఆపుకుంటామని చెప్పారు. డబుల్ రిజిస్టేషన్‌తో ఒక్క బస్సును నడినపినట్టు నిరూపించినా తాము బస్సులన్నీ ఆపేస్తామన్నారు. ఆస్తులు అమ్ముకుని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఈ రోజు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క ఘటనను పట్టుకొని ఇంతగా వేధింపులా?
Published Wed, Jan 1 2014 3:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement