కైలాసకోనలో కామకేళి | prostitution gang busted in kailasakona | Sakshi
Sakshi News home page

కైలాసకోనలో కామకేళి

Published Wed, Apr 1 2015 8:08 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

కైలాసకోనలో కామకేళి - Sakshi

కైలాసకోనలో కామకేళి

తిరుపతి: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార కార్యకలాపాలు వెలుగుచూడడంతో పర్యాటక శాఖలో కలకలం రేగింది. అక్కడ చాలాకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గెస్ట్ హౌస్ సిబ్బందే చెన్నై నుంచి విటులను రప్పించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

వ్యభిచార ముఠా పట్టుబడిన గది బుధవారం తెల్లవారుజామున చెన్నైకి చెందిన ఓ యువకుడు బుక్ చేసుకున్నాడు. తర్వాత మరో ఇద్దరు యువకులు దిగారు. పుత్తూరుకు చెందిన ఇద్దరు యువతులు అనంతరం గదిలోకి ప్రవేశించారు. మధ్యాహ్నం వరకు రాసలీలలు సాగినా టూరిజం సిబ్బంది పట్టించుకోలేదు. 'సాక్షి' కథనంతో టూరిజం శాఖ స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement